వినోదం

Sr NTR : ఎన్‌టీఆర్ డైరెక్ష‌న్‌లో బాల‌కృష్ణ చేసిన సినిమాలు ఏవో తెలుసా..?

Sr NTR : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ ఎన్‌టీఆర్ ఒక మ‌హా శ‌క్తి అని చెప్ప‌వ‌చ్చు. ఈయ‌న త‌న న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానుల‌ను చూర‌గొన్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ద‌శ‌, దిశ చూపించిన వ్య‌క్తి. ఎన్నో సినిమాల్లో న‌టించిన ఎన్టీఆర్ వాటి ద్వారా ఒక ట్రెండ్ సెట్ చేశారు. తెలుగు వారికి రాముడు అంటే ఇలాగే ఉంటాడు కాబోలు అని ఎన్‌టీఆర్‌ను చూసిన త‌రువాతే తెలిసింది. అంతేకాదు.. ఆయ‌న ఏ పౌరాణిక పాత్ర చేసినా అందులో ఒదిగిపోతారు. అందులో జీవిస్తారు. క‌నుక‌నే ఎన్‌టీఆర్ అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది.

ఇక ఎన్‌టీఆర్ ఎంతో మంది ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డ‌మే కాదు.. ఆయ‌న స్వ‌యంగా కొన్ని చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు కూడా. ఆ సినిమాల్లో ఆయ‌న‌తోపాటు ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ కూడా న‌టించారు. ఇక ఆ మూవీలు ఏమిటంటే..

sr ntr directed these movies where balakrishna acted

ఎన్‌టీఆర్ అప్ప‌ట్లో తెర‌కెక్కించిన దాన వీర శూర క‌ర్ణ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలుసు. అయితే ఇందులో ఎన్‌టీఆర్‌తోపాటు బాల‌కృష్ణ కూడా న‌టించారు. దీనికి ఎన్‌టీఆరే ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. అలాగే తాత‌మ్మ‌క‌ల అనే మూవీకి కూడా ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఈ మూవీ ద్వారా బాల‌కృష్ణ సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు.

ఇక ఎన్‌టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌రో మూవీ.. అక్బ‌ర్ స‌లీం అనార్క‌లి. ఇందులోనూ బాల‌య్య న‌టించారు. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అనే మూవీకి కూడాఎన్టీఆర్ దర్శకత్వం వహించ‌గా.. ఇది బాలయ్యకు, ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే మూవీకి కూడా ఎన్టీఆర్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో బాల‌కృష్ణ న‌టించారు. దీంతోపాటు బ్రహ్మశ్రీ విశ్వామిత్రకు సైతం ఎన్టీఆర్ దర్శకత్వం వహించగా దీంట్లోనూ బాలయ్య న‌టించి మెప్పించారు. ఇలా తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో కొడుకు న‌టించ‌డం అంటే.. అది చాలా అరుదుగా జ‌రుగుతుంద‌నే చెప్పాలి. ఈ విష‌యంలో బాల‌య్య చాలా అదృష్ట‌వంతుల‌నే చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts