Vitamin D : విట‌మిన్ డి లోపిస్తే గుండెకు ప్ర‌మాదం.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ డి కావాలి. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. విట‌మిన్ డి కొవ్వులో క‌రుగుతుంది. అయితే విటమిన్ డి లోపిస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vitamin D  deficiency is linked to heart health
Vitamin D

శ‌రీరంలో విట‌మిన్ డి లోపిస్తే అధికంగా బ‌రువు పెరుగుతారు. తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. మాన‌సిక ఆందోళ‌న క‌లుగుతుంది. సంతోషంగా ఉండ‌లేరు. డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోతారు. ఎముక‌లు, కీళ్ల‌లో నొప్పులు వ‌స్తాయి. జుట్టు రాలుతుంది. విట‌మిన్ డి లోపిస్తే గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఎముక‌లు చాలా బ‌ల‌హీనంగా మారుతాయి. సుల‌భంగా విరిగిపోతాయి. మ‌ళ్లీ త్వ‌ర‌గా అతుక్కోవు. ఇవ‌న్నీ విట‌మిన్ డి లోపిస్తే క‌నిపించే ల‌క్ష‌ణాలు.

ఇక విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల శ‌రీరంలో వాపులు వ‌స్తాయి. ఇన్‌ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. క్యాన్సర్ వ‌చ్చే ప్ర‌మాదం పెరుగుతుంది. క‌నుక విట‌మిన్ డి లోపం రాకుండా చూసుకోవాలి.

మ‌న‌కు విట‌మిన్ డి సూర్య‌ర‌శ్మి ద్వారా ల‌భిస్తుంది. రోజూ ఉదయం 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య శ‌రీరానికి ఎండ త‌గిలేలా క‌నీసం 20 నిమిషాలు ఉండాలి. దీంతో మ‌న శ‌రీరం దానంత‌ట అదే విట‌మిన్ డి ని త‌యారు చేసుకుంటుంది. ఇక సోయా ఉత్ప‌త్తులు, ఆవు పాలు, కోడిగుడ్లు, నువ్వుల నూనె, నారింజ పండ్లు, చేప‌లు.. వంటి ఆహారాల్లో మ‌న‌కు విట‌మిన్ డి అధికంగా ల‌భిస్తుంది, వీటిని త‌ర‌చూ తింటుంటే విట‌మిన్ డి లోపం రాకుండా ఉంటుంది.

Share
Admin

Recent Posts