Nethi Beerakaya Pachadi : నేతి బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. వేడిగా అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Nethi Beerakaya Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో నేతి బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. నేతి బీర‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో కూర‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే నేతి బీర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. నేతి బీర‌కాయ‌ల‌తో త‌రుచూ కూర‌లే కాకుండా ఇలా రుచిగా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రుచిగా, ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ నేతి బీర‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నేతి బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నేతి బీర‌కాయ‌లు – పావుకిలో, నూనె – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 15, చింత‌పండు – 2 రెమ్మ‌లు – త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మ‌లు – 5.

Nethi Beerakaya Pachadi recipe in telugu make in this method for taste
Nethi Beerakaya Pachadi

నేతి బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా నేతి బీర‌కాయ‌లను ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, బీర‌కాయ ముక్క‌లు వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత చింత‌పండు, ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ముక్క‌లు చ‌ల్లారిన త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెమ్మ‌లు కూడా వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ ప‌చ్చ‌డిని తాళింపు చేయ‌డానికి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ప‌చ్చ‌డి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నేతి బీర‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన నేతి బీర‌కాయ ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts