technology

కొత్తగా ఫోన్ కొంటున్నారా..? ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

మీరు కొత్త‌గా స్మార్ట్ ఫోన్ కొనాల‌ని చూస్తున్నారా..? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఐక్యూ జ‌డ్‌9 ఫోన్‌ను చాలా త‌గ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆస‌క్తి ఉన్న‌వారు ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కూడా తగ్గింపు ధ‌ర‌కు సొంతం చేసుకోవ‌చ్చు. రూ.20వేల లోపు ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో వేర్వేరు ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ో ఐక్యూ జ‌డ్‌9 ఫోన్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,874గా ఉంది. అమెజాన్‌లో ఇదే ఫోన్‌ను రూ.18,499కి విక్ర‌యిస్తున్నారు.

అయితే అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొంటే రూ.500 డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఇందుకు గాను కూపన్‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. మీరు ఫోన్ కొనేట‌ప్పుడు కూప‌న్ సెలెక్ట్ చేసుకుంటే చాలు రూ.500 డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇక స్టాండ‌ర్డ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌పై అమెజాన్‌లో డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. దీని ధ‌ర రూ.21,999 ఉండ‌గా ప్ర‌స్తుతం 20,499కే ల‌భిస్తోంది. దీనిపై అమెజాన్‌లో రూ.1000 కూప‌న్‌ను ఉప‌యోగించి డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. దీంతో ధ‌ర‌ రూ.19,499 అవుతుంది.

now you can get huge discount on iqoo z9 smart phone

ఐక్యూ జ‌డ్‌9 5జి ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెస‌ర్‌ను అందిస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ 14 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. దీనికి డీటీ స్టార్ 2 ప్ల‌స్ గ్లాస్ ప్రొటెక్ష‌న్ కూడా ఉంది. దీనికి వెనుక భాగంలో డ్యుయ‌ల్ కెమెరాలు ఉన్నాయి. 50 మెగా పిక్స‌ల్ ప్రైమ‌రీ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ సెకండ‌రీ కెమెరా ఉన్నాయి.

ఈ ఫోన్‌లో నైట్ మోడ్‌, సూప‌ర్ మూన్‌, ప్రొ, లైవ్ ఫొటో వంటి ఫొటోగ్ర‌ఫీ ఫీచ‌ర్లు ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌తోపాటు బాక్స్‌లో చార్జ‌ర్‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్‌కు ఐపీ 54 రేటింగ్ ఉంది. డ్యుయ‌ల్ స్టీరియో స్పీక‌ర్ల‌ను క‌లిగి ఉంది. క‌స్ట‌మ‌ర్లు ఈ ఫోన్‌ను బ్ర‌ష్డ్ గ్రీన్‌, గ్రాఫేన్ బ్లూ క‌ల‌ర్‌ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts