వినోదం

Okkadu Movie Niharika : ఒక్క‌డు సినిమాలో మ‌హేష్ కు చెల్లిగా న‌టించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Okkadu Movie Niharika : కేవలం తెలుగు ఇండస్ట్రీలో కాకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా ఒకప్పుడు నటించిన బాల నటులు ఇప్పుడెలా ఉన్నారు.. ఏం చేస్తున్నారనే విషయం తెలుసుకోడానికి సినీ ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తి చూపుతుంటారు. 2000 నుంచి 2005 మధ్య వచ్చిన సినిమాలలో చాలా మంది బాలనటులు ఇప్పుడు పెరిగి పెద్ద‌య్యారు. వారి గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆస‌క్తి చూపుతుంటారు. ఒక్కడు సినిమాలో ఓ బాలనటి ఉంటుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో మహేష్ బాబు చెల్లిగా నటించిన పాప గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు బేబీ నిహారిక. ఇప్పుడు ఆమె వ‌య‌స్సు పాతికేళ్లకు పైగానే ఉంటుంది.

ఒక్క‌డు చిత్రంలో ఆమె ఆశ అనే పాత్ర‌లో న‌టించి మెప్పించింది. ఇక మోహ‌న్ బాబు న‌టించిన య‌మ‌జాత‌కుడు అనే సినిమాలోను అల‌రించింది. వెంక‌టేష్ ప్రేమించుకుందారం అనే చిత్రంలో కూడా ఈ అమ్మ‌డు న‌టించింది. అయితే వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నా కూడా పూర్తిగా తన ఫోకస్ అంతా చదువులపై పెట్టింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా చదువుపైనే దృష్టి సారించింది. చదువు పూర్తి చేసుకున్న నిహారిక ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతుంది. దానికోసమే ఫోటోషూట్స్ కూడా చేస్తుంది ఒక్కడు భామ.

okkadu movie niharika do you know how is she now

2003లో వచ్చింది ఒక్కడు సినిమా. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఒక్కడు సినిమాలో హీరో పాత్రతో పాటు చెల్లి ఆశ పాత్ర కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమించుకుందాం రా సినిమాలో హీరో ప్రేమకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది నిహారిక. కావేరి అక్క ఏం చేస్తుందో తెలుసా.. కాలేజ్ డీటైల్స్ తెలుసా అంటూ వెంకీకి ఎప్పటికప్పుడు సాయపడుతూనే ఉంటుంది నిహారిక. ఆ సినిమా తర్వాత తక్కువ గ్యాప్‌లోనే బాగానే నటించింది ఈమె.

Admin

Recent Posts