information

ఏటీఎంకి వెళ్లాల్సిన ప‌ని లేదు..ఆధార్ ఏటీఎంతో ఇంటి వ‌ద్ద‌కే డ‌బ్బులు..!

మ‌న దేశం క్ర‌మ‌క్ర‌మంగా డిజిట‌ల్ పేమెంట్స్ వైపు ఎక్కువ‌గా దృష్టి పెడుతుంది. ప్లేట్‌ బజ్జీలు కొన్నా, పెద్ద బెంజ్‌ కార్‌ కొన్నా డిజిటల్‌ మోడ్‌లో పేమెంట్‌ చేయడానికే అంద‌రు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నారు. న‌గ‌దుని ఎవ‌రు ఎక్కువ‌గా క్యారీ చేయ‌కుండా అంతా ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఒక‌వేళ భౌతిక నగదు అవసరమైనప్పుడు, ఏటీఎం పక్కనే ఉన్నప్పటికీ చేతిలో డెబిట్‌ కార్డ్‌ లేనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సందర్భంలో ఇంటికి వెళ్లి డెబిట్‌ కార్డ్‌ తెచ్చుకుంటున్నారు లేదా బ్యాంక్‌ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్తున్నారు. సాధారణంగా, డబ్బులు విత్‌డ్రా చేయాలంటే బ్యాంక్‌ లేదా ఏటీఎంకు వెళ్లాల్సిందే. ఇది కాకుండా మరొక సులభమైన పద్ధతి కూడా ఉంది. మీ ఆధార్ కార్డు ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు.

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బయోమెట్రిక్​తో క్యాష్ విత్​డ్రా సహా, ఇతర లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. అయితే కచ్చితంగా మీ బ్యాంకు ఖాతా అధార్ నంబర్​తో లింక్ అయి ఉండాలి. ఆధార్​తో అనుసంధానం అయిన ఏ బ్యాంకు ఖాతాను అయినా బయోమెట్రిక్ ఇచ్చి ఉపయోగించుకోవచ్చు. క్యాష్ విత్​డ్రాతో పాటు ఇతరులకు ట్రాన్స్​ఫర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారికి గరిష్టంగా రూ.10 వేలు వరకు విత్​డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంక్​కు లేదా ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. బిజినెస్ కరస్పాండెంట్ మీ ఇంటి వద్దకే వచ్చి ఈ సేవలు అందిస్తారు.

now you can withdraw cash at home easily

ఆధార్ కార్డ్ నుండి నగదు విత్‌డ్రా చేయడానికి మీ ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం చాలా ముఖ్యం. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా లింక్ చేసుంటే ఈ స్టెప్స్ పాటించండి. మొద‌ట‌గా AEPSకి మద్దతిచ్చే బ్యాంకింగ్ ఏజెంట్ లేదా మైక్రో-ATMని సందర్శించండి. ఇవి సాధారణంగా గ్రామీణ ప్రాంతాలు, బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లు లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలలో కనిపిస్తాయి. త‌ర్వాత‌ మైక్రో ఏటీఎంలో మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.ఫింగర్ ప్రింట్ స్కానర్ సహాయంతో బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి. అథెంటిఫికేషన్ విజయవంతం కావాలంటే మీ డేటా తప్పనిసరిగా ఆధార్ కార్డ్‌తో సరిపోలాలి. అథెంటిఫికేషన్ త‌ర్వాత, సిస్టమ్ మీకు అనేక ఎంపికలను చూపుతుంది. దీని నుండి ‘నగదు విత్‌డ్రా’ ఎంచుకోండి. మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని నమోదు చేయండి. ఇలా చేసిన తర్వాత, మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. మీరు డిపాజిట్ చేస్తున్న మొత్తం విత్‌డ్రా పరిమితిలోపు ఉండాలని గుర్తుంచుకోండి.

Sam

Recent Posts