Okra Capsicum Curry : బెండ‌కాయ‌, క్యాప్సికం క‌లిపి ఇలా కూర చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Okra Capsicum Curry : బెండ‌కాయ‌తో త‌ర‌చూ ఒకేర‌కం కూర‌లు తిని తిని బోర్ కొట్టిందా.. అయితే మీరు క్యాప్సికం బెండ‌కాయ కూర‌ను రుచి చూడాల్సిందే. క్యాప్సికం, బెండ‌కాయలు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా తేలిక‌. త‌క్కువ శ్ర‌మ‌తో ఈ కూర‌ను చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం క్యాప్సికం అలాగే బెండ‌కాయ‌లో ఉండే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాప్సికం బెండ‌కాయ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికం బెండ‌కాయ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ట‌మాటాలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన క్యాప్సికం – పావుకిలో, త‌రిగిన బెండ‌కాయ‌లు – పావుకిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, నీళ్లు – 200 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Okra Capsicum Curry recipe in telugu everybody likes it
Okra Capsicum Curry

క్యాప్సికం బెండ‌కాయ కర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క్యాప్సికం ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి.

వీటిని మ‌రో 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌లపాలి. వీటిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం బెండ‌కాయ కర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌ర‌చూ ఒకేర‌కం కూర‌లు కాకుండా బెండ‌కాయ‌ల‌తో ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts