Palli Chutney Without Oil : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా వివిధ రకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని తినడానికి చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మనం చేసే చట్నీ రుచిగా ఉంటేనే మనం చేసే అల్పాహారాలు రుచిగా ఉంటాయి. ఈ అల్పాహారాలకు మనం వివిధ రకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. అందులో పల్లి చట్నీ కూడా ఒకటి. దీనిని ఎటువంటి అల్పాహారాలతో అయినా కలిపి తినవచ్చు. అందులో భాగంగా చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో, నూనెను ఉపయోగించకుండా పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
దోరగా వేయించిన పల్లీలు – ఒక కప్పు, కరివేపాకు – గుప్పెడు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పచ్చి మిరపకాయలు – 5 లేదా రుచికి తగినన్ని, చింతపండు – 5 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 3, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
పల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా పల్లీల పొట్టు తీసి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకును, కొత్తిమీరను, పచ్చి మిరపకాయలను, చింతపండును, వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉప్పును, తగినన్ని నీళ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి చట్నీ తయారవుతుంది. దీనిని తాళింపు కూడా వేసుకోవచ్చు. ఉదయం పూట సమయం లేని వారు ఇలా అప్పటికప్పుడు చాలా సులువుగా పల్లి చట్నీని తయారు చేసుకుని ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం వంటి వాటితో కలిపి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.