Blood Sugar : డ‌యాబెటిస్ ఉన్న‌వారికి సంజీవ‌ని ఈ మొక్క‌..!

Blood Sugar : వ‌ర్షాకాలంలో ఎక్క‌డ చూసినా చిన్న చిన్న తెల్ల పువ్వుల‌తో చూడ‌గానే మ‌న‌సుకు ఆహ్లాదాన్ని అందించే మొక్క తుమ్మి కూర‌మొక్క‌. చాలా మంది దీనిని వినాయ‌క చ‌వితి రోజూ కూర‌గా వండుకుని త‌ప్ప‌కుండా తింటారు. వ‌ర్షాకాలంలో వ‌చ్చే రోగాల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో తుమ్మికూర మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. తుమ్మి కూర మొక్క వ‌ల్ల క‌లిగే ఆరోగ్యక‌ర‌ ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మి కూర మొక్క‌లు చాలా చిన్న‌గా ఉంటాయి. మ‌నకు పెద్ద తుమ్మి కూర‌, చిన్న తుమ్మి కూర అని రెండు ర‌కాల తుమ్మి కూర మొక్క‌లు ల‌భిస్తాయి. ఇవి రెండూ ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్కలు కారం, చేదు రుచుల‌ను క‌లిగి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి. వాత‌, క‌ఫ‌, మేహ రోగాల‌ను, కామెర్ల‌ను హ‌రించే శ‌క్తిని ఈ తుమ్మి కూర మొక్క క‌లిగి ఉంటుంది.

మెర‌క భూముల్లో, నువ్వుల చేల‌ల్లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. వ‌ర్షాకాలంలో తుమ్మి కూర‌ మొక్క విస్తారంగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకులు స‌న్న‌గా, పొడుగ్గా ఘాటైన వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క పూల‌తో శివున్ని పూజిస్తారు. వ‌ర్షాకాలంలో కొత్త నీరు, కొత్త గాలి కార‌ణంగా మ‌నం అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశం ఉంటుంది. గాలిలో, నీటిలో ఉండే కాలుష్యాన్ని నివారించే శ‌క్తి ఈ తుమ్మి కూర మొక్క‌కు ఉంటుంది. క‌నుక దీనిని వ‌ర్షాకాలంలో త‌ప్ప‌కుండా కూర‌గా వండుకుని తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క పూల‌ను దంచి ర‌సాన్ని తీసి క‌ళ్ల‌ల్లో రెండు చుక్క‌ల మోతాదులో వేయ‌డం వ‌ల్ల ముదిరిన కామెర్ల రోగం కూడా త‌గ్గుతుంది. ప‌క్ష‌వాతానికి గురి అయిన వారికి తుమ్మి కూర‌ను వండి పెట్ట‌డం వ‌ల్ల త్వ‌రగా ఆ వ్యాధి నుండి బ‌య‌ట‌ప‌డ‌తారు. దీనిని ప‌క్ష‌వాత రోగికి ఆహారంలో భాగంగా ఇచ్చేట‌ప్పుడు వాత ప‌దార్థాల‌ను పెట్ట‌కూడ‌దు.

Thummi Kura is very useful for Blood Sugar diabetes
Blood Sugar

మ‌ధుమేహ వ్యాధితో బాధ‌ప‌డే వారు తుమ్మి కూర ఆకుల‌ను, తుల‌సి ఆకుల‌ను, మారేడు ఆకుల‌ను, వేప ఆకుల‌ను విడివిడిగా నీడ‌లో ఎండ‌బెట్టి పొడిగా చేసి అన్నింటినీ క‌లిపి వ‌స్త్రంలో వేసి జ‌ల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఆహారం తీసుకోవ‌డానికి అర గంట ముందు రోజుకు రెండు పూట‌లా మ‌ధుమేహ తీవ్ర‌త‌ను బ‌ట్టి అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక అర గ్లాసు కాచి చ‌ల్లార్చిన నీటిలో క‌లిపి తాగ‌డం వ‌ల్ల మ‌ధుమేహం హ‌రించుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. తేలు, పాము కాటు వంటి విష జంతువులు కాటు వేసిన‌ప్పుడు తుమ్మి కూర ఆకుల‌ను నుండి ర‌సాన్ని తీసి కాటు గురి అయిన ప్ర‌దేశంలో వేసి ఆ ఆకుల ముద్ద‌ను దాని పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి. ఈ ఆకుల ర‌సాన్ని కూడా రెండు టీ స్పూన్ల మోతాదులో తాగించాలి. ఈ ర‌సాన్ని 4 చుక్క‌ల మోతాదులో ముక్కులో కూడా వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాము, తేలు విషాలు హ‌రించుకుపోతాయి.

స్త్రీల‌లో బ‌హిష్టు స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పిని త‌గ్గించి గ‌ర్భాశ‌యం శుద్ది అయ్యేలా చేయ‌డంలో కూడా తుమ్మి కూర మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. పావు టీ స్పూన్ తుమ్మి ఆకుల పొడిని, పావు టీ స్పూన్ మిరియాల పొడిని క‌లిపి రెండు పూట‌లా అర గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో వేసి క‌లిపి బ‌హిష్టు ప్రారంభ‌మైన రోజు నుండి మూడు రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల నొప్పి త‌గ్గ‌డ‌మే కాకుండా గర్భాశ‌యం కూడా శుద్ధి అవుతుంది. ఈ మూడు రోజులు కూడా వారు బియ్యం, పెస‌ర‌ప‌ప్పు, పాలు, నెయ్యి , కండ‌ చ‌క్కెరను క‌లిపి చేసిన దానినే ఆహారంగా తీసుకోవాలి. ఈ విధంగా తుమ్మి కూర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల, దీనిని మితంగా కూర‌గా వండుకుని తిన‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts