Paneer Gulab Jamun : ప‌నీర్‌తోనూ ఎంతో రుచిక‌ర‌మైన గులాబ్ జామున్‌ను త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Paneer Gulab Jamun : ప‌నీర్ అంటే అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. పాల‌తో త‌యారు చేసే దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ప‌నీర్‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. నాన్ వెజ్ తిన‌ని వారు ప్రోటీన్ల కోసం పనీర్‌ను తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ప‌నీర్‌తో అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటాం. అయితే ప‌నీర్‌తో ఎంతో రుచిక‌ర‌మైన గులాబ్ జామున్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ప‌నీర్‌తో గులాబ్ జామున్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ గులాబ్ జామున్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌నీర్ తురుము – 1 క‌ప్పు, పాల పొడి – 2 క‌ప్పులు, ర‌వ్వ – 2 టేబుల్ స్పూన్లు, బాదం పాలు – 1 టేబుల్ స్పూన్‌, గుడ్డు – 1, చ‌క్కెర – 1 క‌ప్పు, బేకింగ్ సోడా – చిటికెడు, నీళ్లు – 2 క‌ప్పులు, నూనె – డీప్ ఫ్రైకి స‌రిప‌డా.

Paneer Gulab Jamun recipe in telugu make in this way
Paneer Gulab Jamun

ప‌నీర్ గులాబ్ జామున్‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక గిన్నెలో రవ్వ, పనీర్ తురుము, బేకింగ్ సోడా, పాలపొడి, గుడ్డు, బాదంపాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కడా ఉండలు లేకుండా పేస్టులా మెత్తగా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో నూనె వేసి నూనె కాగిన తరువాత పనీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా చ‌క్కెర‌తో పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోరగా వేయించిన పన్నీర్ ఉండలను ఓ అరగంట పాటు పాకంలో వేసి ఉంచాలి. దీంతో ఉండ‌ల‌కు చ‌క్కెర బాగా ప‌డుతుంది. అంతే.. పనీర్ గులాబ్ జామున్ రెడీ అయిన‌ట్లే. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts