Parigela Pakodi : ప‌రిగెల‌తో చేసే ఈ ప‌కోడీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే మొత్తం ఖాళీ చేస్తారు..!

Parigela Pakodi : చంద‌మామ ప‌రిగెలు.. మ‌నం ఆహారంగా తీసుకునే చేప‌ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి. వీటినే నెత్త‌ళ్లు అని కూడా అంటారు. ఈ చేప‌లు చూడ‌డానికి చిన్న‌గా తెల్ల‌గా ఉంటాయి. వీటితో ఎక్కువ‌గా పులుసు త‌యారు చేస్తూ ఉంటారు. ప‌రిగె పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పులుసును ఇష్టంగా తింటారు. ఈ ప‌రిగెల‌తో మ‌నం పులుసునే కాకుండా ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌రిగెల‌తో చేసే ఈ ప‌కోడీ చాలా రుచిగా ఉంటుంది. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌రిగెల‌తో ఎంతో రుచిగా క‌ర‌క‌ర‌లాడే ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌రిగె ప‌కోడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌రిగెలు – అర‌కిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, కాశ్మీరి కారం – 2 టీ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా -అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్, ప‌చ్చిమిర్చి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్ లేదా త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు.

Parigela Pakodi recipe in telugu make in this way
Parigela Pakodi

ప‌రిగె ప‌కోడి త‌యారీ విధానం..

ముందుగా ప‌రిగెల‌ను రాళ్ల ఉప్పు వేసి పై పొట్టు పోయేలా బాగా రుద్దాలి. త‌రువాత నీళ్లు పోసి బాగా క‌డ‌గాలి. త‌రువాత ఒక గిన్నెలో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు ప‌రిగెల‌ను వేసి క‌లపాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌రిగెల‌ను వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత అటూ ఇటూ క‌దుపుతూ వేయించాలి. మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌రిగె ప‌కోడీలు త‌యార‌వుతాయి. వీటిని నేరుగా తిన‌వ‌చ్చు. అలాగే సైడ్ డిష్ గా కూడా తిన‌వ‌చ్చు. చంద‌మామ ప‌రిగెల‌తో త‌ర‌చూ పులుసే కాకుండా ఇలా ప‌కోడీలుగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts