ఢిల్లీ మెట్రో ట్రైన్ లో జరిగిన ఒక సంఘటన కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మెట్రో ట్రైన్ లో ప్యాసింజర్లు అందరూ కలిసి ఒక దొంగను పట్టుకున్నారు. పారిపోడానికి ప్రయత్నిస్తున్నాడని ప్యాసింజర్లు దొంగను పట్టుకొని కొట్టారు. అయితే ఆ సమయంలో దొంగ డోర్ దగ్గర నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు.
అది క్లోజ్ అయ్యి ఉండడంతో అక్కడ ఉన్న అద్దాన్ని పగలగొట్టి బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా పాసింజర్లు కోచ్ లోకి లాక్కొని తీసుకువెళ్లి అతన్ని కొట్టారు. ఈ సంఘటన జరుగుతన్న సమయంలో చాల మంది వారి స్మార్ట్ ఫోన్స్ లో రికార్డు చేసి సోషల్ మీడియా లో షేర్ చేసారు.
వైరల్ గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కు గురయ్యారు. ఇంతమంది జనాల మధ్యలో ఆ దొంగను కొడుతున్నప్పుడు అతను బయటికి రాలేకపోయాడు. ఇలా చేయకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అని నేటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో కేవలం 25 సెకండ్లు మాత్రమే అయినా ఇటువంటి సంఘటనను చూసిన నెటిజన్లు షాక్ కు గురయ్యారు.