Poonam Kaur : పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే ఈమె నటించిన నాతి చరామి అనే సినిమా ప్రెస్ మీట్లో భాగంగా స్టేజిపై కన్నీటి పర్యంతం అయింది. అయితే తన గురించి తప్పుగా రాశారంటూ మండి పడింది. కొందరు తన జీవితాన్ని నాశనం చేశారని ఆమెనే పలుమార్లు చెప్పింది. దీంతో అదే విషయాన్ని చాలా మంది రాసుకొచ్చారు. కానీ కొందరు మాత్రం ఇంకా వక్రీకరించి రాశారు. దీంతో పూనమ్ కౌర్ ఫైర్ అయ్యింది. అయితే తాజాగా మరోమారు పూనమ్‌కౌర్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆమెకు యాంకర్ల నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆమె సమాధానం చెప్పలేకపోయింది.
పూనమ్‌కౌర్ చాలా రోజుల తరువాత నటించిన సినిమా.. నాతిచరామి. ఈ సినిమా ఏకంగా 20 ఓటీటీ యాప్‌లలో విడుదలవుతోంది. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక పూనమ్ కౌర్ కూడా ఆ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే ఓ చానల్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటికి ఆమె సమాధానాలు చెప్పలేకపోయింది. పవన్ కల్యాణ్ గురించి చెప్పాలని అడగ్గా.. ఆమె స్పందిస్తూ.. కాస్త ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. ఇంకేముంది.. ఏం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తారు కదా.. అదే నిజం.. అని సమాధానం చెప్పింది.
అలా కాదు.. పవన్ కల్యాణ్ గురించి పాజిటివ్‌గా మాట్లాడండి.. అని అడగ్గా.. నేను పాజిటివ్‌గా మాట్లాడినా.. అది నెగెటివ్ అవుతుంది.. వద్దులెండి.. అంటూ సమాధానం దాటవేసింది. ఇక పూనమ్ కౌర్ ఎప్పుడూ వివాదాస్పద పోస్టులు పెడుతుంటుంది. కానీ వాటిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగానే వాటిని ఆమె డిలీట్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఇలాగే చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.