Potato Idli : ఆలుగ‌డ్డ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Potato Idli : మ‌నం బంగాళాదుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తాయి. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో వంట‌కాల‌తో పాటు మ‌నం ఎంతో రుచిగా ఉండే ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఇడ్లీలను ఇన్ స్టాంట్ గా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఇటువంటి పిండి ప‌ట్టే ప‌ని లేకుండా ఆలూ ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బంగాళాదుంప‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చిమిర్చి – 1, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, వంట‌సోడా – పావు టీ స్పూన్.

Potato Idli recipe in telugu make in this method
Potato Idli

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

ఆలూ ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో బంగాళాదుంప ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌చ్చిమిర్చి, అల్లం ముక్క‌లు వేసి మెత్త‌ని పేస్ట్ లా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బొంబాయి ర‌వ్వ‌, చిల్లీ ప్లేక్స్, ప‌చ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర‌, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ర‌వ్వ‌ను 10 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. తరువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా సిద్దం చేసుకున్న ర‌వ్వ మిశ్ర‌మంలో వేసి క‌ల‌పాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద ఇడ్లీ పాత్ర‌ను ఉంచి అందులో నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి.

నీళ్లు వేడ‌య్యాక ఇడ్లీ ప్లేట్ ల‌లో ర‌వ్వ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి. త‌రువాత ఈ ప్లేట్ ల‌ను ఇడ్లీ పాత్ర‌లో ఉంచి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఇడ్లీల‌ను బ‌య‌ట‌కు తీసి కొద్దిగా చ‌ల్లారే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఇడ్లీల‌ను ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఇడ్లీలు త‌యార‌వుతాయి. వీటిని పల్లి చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ఇడ్లీల కంటే ఈ విధంగా బంగాళాదుంప‌ల‌తో త‌యారు చేసిన ఇడ్లీలు మ‌రింత రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఇడ్లీల‌ను కూడా తయారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts