Actress : ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే చాలు.. సెలబ్రిటీల స్టార్ డమ్ ఎక్కడికో పోతుంది. అయితే అంతటి పాపులారిటీ వచ్చింది కదా.. అని ఎగిరెగిరి పడకూడదు. అది ఎన్నటికైనా ఇబ్బందులనే తెచ్చి పెడుతుంది. ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు ఎక్కువగా రావాలన్నా.. మరింత పాపులర్ కావాలన్నా.. అంత గర్వంగా ఉండకూడదు. కానీ ఓ యంగ్ హీరోయిన్ మాత్రం ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నదట. ఇంకా చెప్పాలంటే.. తాను నటించిన ఒకే ఒక్క సినిమా హిట్ అయిందని చెప్పి.. ఆ అమ్మడికి గర్వం నెత్తికెక్కిందట. అలా అని ఆమెతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలే అంటున్నారు. వారికి ఆ అమ్మడు చుక్కలు చూపిస్తున్నదట.
ఆమె నటించిన ఒక్క సినిమా బంపర్ హిట్ అయింది. దీంతో ఆమె అగ్రహీరోల సరసన నటించే చాన్స్‌లను కొట్టేస్తోంది. ఆమె చేతిలో పలు వరుస ఆఫర్లు కూడా ఉన్నాయి. అయితే తనకు అంత పాపులారిటీ లభించడంతో ఆ అమ్మడు తన రూటు మార్చిందట. సెలబ్రిటీ అయిపోయాం కదా.. ఆమాత్రం ప్రవర్తించకుండా ఉంటే ఎలా ? అన్నట్లుగా షూటింగ్ సమయాల్లో వ్యవహరిస్తోందట. దీంతో ఆమె ప్రవర్తనకు దర్శక నిర్మాతలు విసిగిపోతున్నారట.
షూటింగ్ లకు ఆలస్యంగా రావడం.. దర్శక నిర్మాతలు చెప్పింది వినకుండా పెడచెవిన పెట్టడం.. డాబు దర్పం.. వంటివి చూపించడం చేస్తున్నదట. దీంతో ఆమెతో సినిమా చేయాలంటోనే మేకర్స్ విసుగు చెందుతున్నారట. ఇలాంటి వ్యక్తిత్వం నిజానికి ఇండస్ట్రీలో పనికి రాదు. అది ఎప్పటికైనా చేటు తెస్తుంది. అణకువగా, హుందాగా ఉన్నవారికే గౌరవం దక్కుతుంది.