Shiva Linga Pushpam : శివుడికి ఈ ఒక్క పుష్పాన్ని స‌మ‌ర్పిస్తే చాలు.. అష్టైశ్వ‌ర్యాలు మీ సొంత‌మ‌వుతాయి..!

Shiva Linga Pushpam : అత్యంత మ‌హ‌త్యం క‌లిగిన పుష్పాల‌లో శివ‌లింగ పుష్పం కూడా ఒక‌టి. ఈ పుష్పంతో శివున్ని పూజించ‌డం వ‌ల్ల విశేష ఫ‌లితం క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. అస‌లు శివ లింగ పుష్పాలు ఏవిధంగా ఉంటాయి.. ఎక్క‌డ ఉంటాయి.. వీటితో శివున్ని పూజించ‌డం వ‌ల్ల క‌లిగే ఫ‌లితాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుష్పాలు శివ లింగ వృక్షం నుండి ల‌భిస్తాయి. శివ లింగ వృక్షాలు ఎక్కువ‌గా ద‌క్షిణ భార‌త దేశంలో, ద‌క్షిణ అమెరికాలో ఎక్కువ‌గా ఉంటాయి. దీనిని నాగ లింగ వృక్షం అని కూడా అంటారు.

ఈ పుష్పాల మ‌ధ్య భాగం ప‌డ‌గ విప్పిన స‌ర్పం లాగా ఉంటుంది. ఈ వృక్షం ఆకులు వెంట్రుక‌ల లాగా ఉంటాయి. ఈ శివ లింగ పుష్పాలు కొమ్మ‌ల‌కు పూయ‌కుండా వెంట్రుక‌లాంటి భాగాల‌కు పూస్తాయి. ఈ పుష్పాలు పై భాగాన నాగ‌ప‌డ‌గ క‌ప్పిన‌ట్టు ఉండి లోప‌ల శివ‌లింగాకృతిలో ఉంటాయి. ఈ పుష్పాల‌ను నాగ‌మ‌ల్లి, మ‌ల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఎంతో చ‌క్క‌ని ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లుతూ ఉంటాయి.

pray with Shiva Linga Pushpam to Lord Shiva for wealth
Shiva Linga Pushpam

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఈ చెట్టు ప్ర‌తి భాగంలోనూ శివుడు నెల‌కొని ఉంటాడ‌ని భావిస్తారు. ఈ పుష్పాలు స‌ర్వ దేవ‌త‌ల‌కు.. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన‌వి. ఈ పుష్పాల‌తో శివున్ని పూజించ‌డం ప్ర‌తి భ‌క్తునికి ఒక వరం. ఈ పుష్పాల‌తో శివున్ని పూజించిన వారికి జ‌న్మ రాహిత్యాన్ని పొంది అంతిమమున కైవ‌ల్యం పొందుతార‌ని శివ పురాణం చెబుతోంది. శివ లింగ పుష్పాల‌ను ఏ దేవునికైనా స‌మ‌ర్పించేట‌ప్పుడు త‌ల పై లేదా భుజ స్కంధాల‌పై మాత్ర‌మే స‌మ‌ర్పించాలి. పార్వ‌తీ దేవికి ఈ పుష్పాన్ని మాంగ‌ల్యంలో స‌మ‌ర్పించాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా శివ‌లింగ పుష్పంతో పూజ‌లు చేయ‌డం వ‌ల్ల కోరిన కోరిక‌లు తీరుతాయ‌ని.. ఆయురారోగ్య అష్టైశ్వ‌ర్యాలు క‌లుగుతాయ‌ని అంటున్నారు.

D

Recent Posts