Ragi Uttapam : రాగి ఊతప్పం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇన్‌స్టంట్‌గా ఇలా వేసుకోవచ్చు..!

Ragi Uttapam : చిరుధాన్యాల్లో ఒకటైన రాగులను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగుల్లో అనేక పోషకాలు ఉంటాయి. రాగులను పిండిగా మార్చి దాంతో జావ లేదా అంబలి తయారు చేసి వేసవిలో తాగితే శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరు రాగులను తినేందుకు ఇష్టపడరు. కానీ వాటితో టిఫిన్లు తయారు చేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. ఈ క్రమంలోనే వాటిలో ఒకటైన రాగి ఊతప్పం కూడా రుచి బాగానే ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి ఊతప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..

రాగి పిండి – రెండు కప్పులు, జీలకర్ర – ఒక టీస్పూన్‌, పెరుగు – అర కప్పు, అల్లం తురుము – ఒక టేబుల్‌ స్పూన్‌, పచ్చి మిర్చి – 2, ఉప్పు – రుచికి సరిపడా, టమాటా ముక్కలు – ఒక కప్పు, ఉల్లికాడలు, క్యాప్సికం ముక్కలు – ఒక కప్పు.

Ragi Uttapam recipe in telugu very tasty and healthy
Ragi Uttapam

రాగి ఊతప్పం తయారు చేసే విధానం..

రాగి పిండిలో జీలకర్ర, పెరుగు, అల్లం తురుము, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు.. అన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి దోశ పిండిలా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని పెనం మీద ఊతప్పంలా వేసి దాని మీద కూరగాయల ముక్కలు వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే రాగి ఊతప్పం రెడీ అవుతుంది. దీన్ని ఏదైనా చట్నీతో తినవచ్చు. ఉదయం టిఫిన్‌ చేసేందుకు సమయం లేనప్పుడు ఇలా రాగి ఊతప్పంను వెంటనే అప్పటికప్పుడు వేసుకోవచ్చు. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు. ఆరోగ్యకరం కూడా కనుక తరచూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Editor

Recent Posts