Sye Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు హీరోలను పాన్ ఇండియా హీరోలుగా మారుస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి మూవీ పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కావడంతో అప్పటి నుంచి ఆయన సత్తా ఏమిటో దేశానికే కాదు.. ప్రపంచానికి కూడా తెలిసింది. దీంతో ఆయనతో సినిమాలు తీసేందుకు కేవలం తెలుగు హీరోలే కాకుండా ఇతర భాషలకు చెందిన హీరోలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి ఇప్పట్లో ఇతర భాషలకు చెందిన చిత్రాలు తీయనని చెప్పారు. కనుక తెలుగు హీరోలే ఆయన సినిమాల్లో నటించనున్నారు. అయితే ఆయన సినిమాల్లో నటించాలని ఇప్పుడైతే చాలా మందికి ఉంటుంది. కానీ ఒకప్పుడు రాజమౌళి ఇంత పెద్ద దర్శకుడు కాదు. ఒకటి రెండు సినిమాలు తీసి ఓ సాధారణ దర్శకుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన సై సినిమా కథను ఉదయ్ కిరణ్‌కు వినిపించారట. కానీ ఆ లవర్ బాయ్ సై సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అప్పట్లో ఉదయ్ కిరణ్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన అనేక చిత్రాలు హిట్ కావడంతో సక్సెస్ బాటలో కొనసాగుతున్నాడు. అయితే అదే సమయంలో దర్శకుడు రాజమౌళి ఓ సాధారణ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సమయంలోనే ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్లిన ఆయన సై సినిమా స్టోరీని వినిపించారట. కానీ ఉదయ్ కిరణ్‌కు అప్పుడు చేతి నిండా సినిమాలు ఉండి ఖాళీగా లేడు. దీంతో సై సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ తరువాత ఆ మూవీ స్టోరీని దర్శకుడు రాజమౌళి నితిన్‌కు వినిపించారు. దీంతో నితిన్ ఆ కథను ఓకే చేయగా.. ఆ మూవీ తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
అలా సై సినిమా అప్పట్లో విడుదలై సంచలనాలను సృష్టించింది. ముఖ్యంగా ఈ మూవీ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. దర్శకుడిగా రాజమౌళిని మరో మెట్టు పైన నిలబెట్టిన సినిమా ఇది. ఇక ఆ తరువాత రాజమౌళి వరుసగా సినిమాలు తీసి హిట్స్ కొడుతూనే ఉన్నారు. ఎక్కడా ఆయన విజయాల పరంపరకు బ్రేక్ పడలేదు. ఈ క్రమంలోనే ఆయన దర్శక ధీరుడు అయ్యారు. అయితే ఉదయ్ గనక సై సినిమా చేసి ఉంటే ఆ కథ వేరేలా ఉండేది. ఆ తరువాత ఉదయ్ కూడా ఆ సినిమా చేయనందుకు చాలా బాధపడ్డాడట. అయినా విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. గ్రహచారం అంటే అదే. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆ మాట అక్షరాలా నిజమేనని అనిపిస్తుంటుంది.