Rashmi Gautam : యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌.. అలా అనేసింది..!

Rashmi Gautam : బుల్లితెర‌పై స‌క్సెస్ సాధించి త‌రువాత సినిమాల్లో న‌టీమ‌ణులుగా చెలామ‌ణీ అయిన వారు ఎంద‌రో ఉన్నారు. అలాంటి వారిలో ర‌ష్మి గౌత‌మ్ ఒక‌రు. ఈమె మొద‌ట్లో సినిమాల్లోనే న‌టించింది. త‌రువాత యాంక‌ర్ అయింది. ఆ త‌రువాత కూడా ప‌లు సినిమాల్లో ఈమెకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఆ సినిమాలు పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. దీంతో ర‌ష్మి గౌతమ్ యాంక‌ర్‌గానే మిగిలిపోయింది. అయిన‌ప్ప‌టికీ బుల్లితెర‌పై ఈమె చేసే సంద‌డి అంతా ఇంతా కాదు.

Rashmi Gautam shared a post which became viral
Rashmi Gautam

మూగ‌జీవాల ప‌ట్ల ర‌ష్మి గౌత‌మ్ ఎంతో ప్రేమ చూపిస్తుంది. వాటిపై దాడి చేసే వారిని.. వాటిని చంపేవారిపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటుంది. అలాగే మూగ‌జీవాల‌ను హింసిస్తే క‌న్నీటి ప‌ర్యంతం అవుతుంది. అయితే ర‌ష్మి గౌత‌మ్ ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. కానీ ఈమెకు, సుధీర్‌కు ఏదో అంట‌గ‌డుతూ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తుంటారు. అలాంటి వాటిని ఈమె పెద్ద‌గా ప‌ట్టించుకోదు. అయితే తాజాగా ర‌ష్మి గౌత‌మ్ ఒక పోస్టును షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

సోష‌ల్ మీడియాలో రోజూ చాలా మంది అనేక విమ‌ర్శ‌లు, మీమ్స్‌, ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటిదే ఒక ట్రోల్‌పై ఆమె స్పందించింది. సినిమా ఇండ‌స్ట్రీలో టాప్ పొజిష‌న్‌కు చేరుకుంటుంది.. అంటే.. ఆమె అందరితోనూ ప‌డుకుంది.. అందుక‌నే అది సాధ్య‌మైంది.. అంటూ ఒక మీమ్ వ‌చ్చింది. దీనిపై ర‌ష్మి గౌత‌మ్ స్పందించింది. అవును.. అలా అన‌డం చాలా తేలికే.. చాలా మంది అలా అనేస్తుంటారు.. అని ర‌ష్మి కామెంట్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్ వైర‌ల్ అవుతోంది.

అయితే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది న‌టీమ‌ణులు క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పుతున్నారు. దీంతో వారి విష‌యాలు వైర‌ల్ అవుతున్నాయి. ర‌ష్మి గౌత‌మ్ కూడా అలాంటి ప‌రిస్థితుల‌ను అనుభ‌వించిందా.. అందుక‌నే ఇలా కామెంట్ చేసిందా.. అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

Editor

Recent Posts