Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత జోరు మీదుంది. వరుస సినిమాల్లో నటిస్తూనే ఈమె గ్లామర్ షో చేస్తోంది. ఇటీవలే ఈమె గోవాలో తన స్నేహితులతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేసింది. అందులో భాగంగానే ఈమె బికినీ ధరించి అలరించింది. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు. పుష్ప సినిమాలో ఊ అంటావా.. పాటతో ప్రేక్షకులను మైమరిపింపజేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి.
సమంత తాజాగా ఓ మద్యం బ్రాండ్‌కు యాడ్ చేసింది. అందులో భాగంగా ఆమె ధరించిన డ్రెస్ మతులు పోగొడుతోంది. అందాలన్నీ కనిపించేలా సమంత గ్లామర్ షో చేసింది. వాస్తవానికి నాగచైతన్యతో ఉన్న సమయంలోనూ ఈమె ఈ విధంగానే గ్లామర్ షో చేసేది. అయితే ఆ విషయం నచ్చకే ఈమె అతనికి విడాకులు ఇచ్చిందని ఇప్పటికీ అంటుంటారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం అనే సినిమాల్లో నటిస్తోంది. ఈమె నటించిన కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. అలాగే త్వరలో విజయ్ దేవరకొండ పక్కన ఈమె ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది.