ఆధ్యాత్మికం

Hanuman Mantra : రోజూ ఈ ఆంజ‌నేయ స్వామి మంత్రాన్ని ప‌ఠిస్తే.. ఎలాంటి భ‌యాలు ఉండ‌వు.. దుష్ట శ‌క్తులు ఏమీ చేయ‌లేవు..!

Hanuman Mantra : హిందూ పురాణాల్లో హ‌నుమంతుడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న చిరంజీవి అని.. ఇప్ప‌టికీ జీవించే ఉన్నాడ‌ని.. ఆయ‌న‌కు మ‌ర‌ణం లేద‌ని.. ఆయ‌న హిమాల‌యాల్లో క‌నిపించాడ‌ని.. అంటుంటారు. అయితే ఈ వార్త‌లు నిజ‌మో కాదో తెలియ‌దు కానీ.. హ‌న‌మంతుడు మాత్రం చిరంజీవే. ఆయ‌న‌కు మృత్యువు లేదు. రాదు. అందుక‌నే ఆయ‌న‌కు పూజ‌లు చేస్తే మృత్యు భ‌యం ఉండ‌ద‌ని. అన్ని ర‌కాల భ‌యాలు పోతాయ‌ని అంటుంటారు. అయితే ఆంజ‌నేయ స్వామికి చెందిన ఓ మంత్రాన్ని రోజూ ప‌ఠిస్తే.. ఎలాంటి భ‌యాలు ఉన్నా స‌రే పోతాయి. ఇంత‌కీ ఆ మంత్రం ఏమిటంటే..

ఆంజ‌నేయుడు మ‌హా బ‌ల‌వంతుడు. భూత ప్రేత పిశాచాల‌ను, దుష్ట శక్తుల‌ను త‌రిమి కొడ‌తాడు. ఆయ‌న‌ను త‌ల‌చుకుంటే అన్ని భ‌యాలు పోతాయి. దుష్ట శ‌క్తులు మ‌న ద‌గ్గ‌ర ఉండ‌వు. మ‌న‌ల్ని బాధించ‌వు. ఆయ‌న మంత్రం ప‌ఠిస్తే అన్ని భ‌యాల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. ఆయ‌న మంత్రం ఇదే..

read this lord hanuman mantra daily to ward off evil spirits

మ‌నోజ‌వం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమ‌తాం ప‌రిష్టం

వాతాత్మ‌జం వాన‌ర యూధ ముఖ్యం శ్రీ‌రామ దూతం శిర‌సాన‌మామి

ఈ మంత్రానికి అర్థం ఇదే.. వాయువేగ మనో వేగాల‌తో ప్ర‌యాణించ‌గ‌ల‌వాడు, ఇంద్రియాల‌ను జ‌యించిన వాడు, బుద్ధిమంతుడు, అంద‌రిలోకి ఉన్న‌తుడు, వాయుదేవుని పుత్రుడు. వాన‌ర యోధుల్లోకెల్లా ముఖ్యుడు, శ్రీ‌రామ దూత అయిన ఆంజ‌నేయుడికి న‌మ‌స్క‌రిస్తున్నాను అని దీని అర్థం. క‌నుక ఈ మంత్రాన్ని రోజూ పఠిస్తే అన్నీ శుభాలే క‌లుగుతాయి. ముఖ్యంగా భ‌యాలు ఉండ‌వు. ఉద‌యం స్నానం చేశాక ఆంజ‌నేయ స్వామి వ‌ద్ద బొట్టు పెట్ట‌కుని ఈ మంత్రాన్ని ప‌ఠించాలి. ఎలాంటి భ‌యాలు, బాధ‌లు, ఆందోళ‌న‌లు ఉండ‌వు. ఎల్ల‌ప్పుడూ ధైర్యంగా ఉంటారు. అనుకున్న ప‌ని పూర్తి చేస్తారు. స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.

Admin

Recent Posts