lifestyle

Anna Danam : అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది.. ఎందుకో తెలుసా..?

Anna Danam : చాలామంది పుణ్యం కలగాలని, మంచి జరగాలని అనేక రకాల దానాలని చేస్తూ ఉంటారు. అయితే అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది అని మీరు చాలా సార్లు వినే ఉంటారు. నిజానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని దానాల కంటే కూడా అన్నదానం ఎంతో గొప్పది. ఒక పూట ఎవరికైనా భోజనం పెడితే చాలా చక్కటి ఫలితం కనబడుతుంది. అందుకే అన్నదానం అన్ని దానాల కంటే కూడా గొప్పదని అంటారు.

మరి అన్నదానం యొక్క విశిష్టత అంటే ఏమిటి..?, దాని ప్రాధాన్యత ఏంటి.. అనే వివరాలని మనం తెలుసుకుందాం. ఎన్ని ధర్మాలు చేసినా, ఎవరికి ఎన్ని ఇచ్చినా, ఇంకా ఇంకా ఏమిచ్చినా కూడా కావాలని అంటూ ఉంటారు. కానీ అన్న దానం చేస్తే ఇంకా ఇంకా కావాలని అడగరు. సంతృప్తి చెందుతారు. కానీ మిగిలిన ఏ దానాలు చేసినా కూడా వాళ్ళకి ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది.

rice donation is great in all donations

వాళ్ళని అది సంతృప్తి పరచదు. కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అంటారు. పైగా అన్నం లేకుండా భూమి మీద ఏ ప్రాణి కూడా నివసించలేదు. మూడు పూట‌లా ఏ లోటు లేకుండా అన్నం దొరికితే మనకి చాలు. ఇక మనకి ఏమీ అక్కర్లేదు. పైగా మనం అన్నం తీసుకున్న ప్రతి సారి కూడా అన్నపూర్ణా దేవిని తలుచుకుంటూ ఉంటాము.

ఏ దానం చేసినా కూడా మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలి. గోదానం, వస్త్ర దానం, కన్యాదానం, భూదానం వంటివి కూడా ఎంతో విశిష్టమైనవి. ఎవరికైతే దాన గుణం ఉండదో వాళ్ళకి మోక్షం లభించదట. ఎలాంటి స్వార్థం లేకుండా ఎవరికైనా సహాయం చేస్తే మాత్రం చక్కటి ఫలితం కనబడుతుంది. ఆకలితో ఉన్నవాళ్ళకి, పేదలకు, లేదంటే అనారోగ్యం ఉన్నవాళ్లకి, వికలాంగులకి, అనాథ‌లకి అన్నదానం చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

Admin

Recent Posts