వినోదం

Vetagadu Movie : వేట‌గాడు సినిమా చేసేందుకు శ్రీ‌దేవి మొద‌ట ఒప్పుకోలేద‌ట‌.. త‌రువాత ఏమైందంటే..?

Vetagadu Movie : నటన మీద మక్కువతో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొని, కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా, అభిమానుల దేవుడిగా మారిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. పౌరాణిక, జానపద, సాంఘికం ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ ఒక సపరేట్ ట్రెండ్ ని సెట్ చేసారు. వరుస విజయాలతో ప్రతీ ఏటా దాదాపు పదుల సినిమాలు విడుదల చేస్తూ బిజీగా గడిపారు.

అప్పటిలో ఎన్టీఆర్ తో సినిమాలలో కలిసి నటించడానికి ఎంతో మంది హీరోయిన్లు తాపత్రయపడేవారు. ఎన్టీఆర్ తో నటించడానికి ఒక్క అవకాశం వస్తే చాలని అనుకునేవారు. 1970 తర్వాత ఎన్టీఆర్ రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆయన సినిమాలను చూడటానికి జనాలు ఎలాంటి వాహన సౌకర్యం లేని రోజులలో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళే వాళ్ళు. ఇక ఆ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒక కథ సిద్ధం చేసుకున్నారు. ఆ సినిమానే వేటగాడు. ఈ సినిమా సాధించిన విజయం ఇప్పటికి కూడా ఒక సంచలనం అని చెప్పవచ్చు.

అయితే వేటగాడు సినిమాకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజుల వరకూ ఒక స్పష్టత రావడం లేదట. రాఘవేంద్రరావు మాత్రం హీరోయిన్ విషయంలో శ్రీదేవి అనే మాట తప్ప మరో మాట మాట్లాడటం లేదట. వేటగాడు సినిమా నిర్మాత అర్జున రాజు మాత్రం ఆమెను వద్దంటే వద్దని కచ్చితంగా చెప్పేశారట. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి మరీ చిన్న పిల్లలా ఉంటుందని వద్దన్నారట.

ఇక దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డారు. శ్రీదేవి కూడా ఎన్టీఆర్ పక్కన చేయడానికి ఇష్టం చూపించలేదు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అనుకోవడం చివరికి ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. నిర్మాతలను పిలిచి మాట్లాడిన ఎన్టీఆర్ అసలు విషయం అడిగితే.. 5 ఏళ్ళ క్రితం మీ పక్కన బడిపంతులు చిత్రంలో మనవరాలిగా నటించింది.. ఇప్పుడు ఆమెను హీరోయిన్ అంటే జనాలు రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండరు. ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించి సినిమాల్లో నటించే వారికి సెంటిమెంట్ లు చూడకండి.

ప్రేక్షకులు దేవుళ్ళుతో సమానం. వాళ్ళు అన్నీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీకు ఎందుకు బాధ, నాదీ బాధ్యత. అంతేకాకుండా మీకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడతా అని హామీ కూడా ఇచ్చారట. సినిమా కథాంశం బలంగా ఉండాలి గాని ఇవన్నీ ఎందుకు అన్నారట. శ్రీదేవిని కూడా ఆయనే స్వయంగా ఒప్పించటం జరిగింది. ఫైనల్ గా వేటగాడు సినిమా తెరపైకి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్, శ్రీదేవి జోడి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ సినిమా హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Admin

Recent Posts