Rice Flour Laddu : బియ్యం పిండితో ఎంతో టేస్టీగా ఉండే ల‌డ్డూల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Rice Flour Laddu : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే పిండి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా బియ్యం పిండితో కారం పిండి వంట‌కాల‌నే త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం కారం వంట‌కాలే కాకుండా బియ్యం పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యం పిండితో చేసే ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – ఒక క‌ప్పు, పుట్నాల ప‌ప్పు – అర క‌ప్పు, ప‌ల్లీలు -అర క‌ప్పు, నువ్వులు -2 టీ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి తురుము – పావు క‌ప్పు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, బెల్లం తురుము – ఒక క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగి వేయించిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.

Rice Flour Laddu recipe in telugu make in this method
Rice Flour Laddu

ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో పుట్నాలు వేసి వేయించాలి. వీటిని ప్లేట్ లోకి తీసుకున్న త‌రువాత ప‌ల్లీలను కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలాగే నువ్వులు, ఎండు కొబ్బ‌రి తురుము, బియ్యం పిండిని కూడా ఒక్కొక్క‌టిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత వేయించిన ప‌ల్లీల‌ను, పుట్నాల‌ను పొడిగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే నువ్వులు, బియ్యం పిండి, ఎండు కొబ్బ‌రి తురుము, యాల‌కుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నెయ్యి వేసి బాగా క‌ల‌పాలి.

ఇప్పుడు క‌ళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత దీనిని మ‌రో 3 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ బెల్లం మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి ముందుగా త‌యారు చేసుకున్న బియ్యం పిండి మిశ్ర‌మంలో వేసి క‌ల‌పాలి. ఇప్పుడు చెయ్యికి నెయ్యి రాసుకుంటూ కావ‌ల్సిన ప‌రిమాణంలో ల‌డ్డూల‌ను చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి ల‌డ్డూలు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

D

Recent Posts