Ajwain Leaves : ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదలొద్దు.. అంతలా ఉపయోగపడుతుంది..!

Ajwain Leaves : ప‌చ్చ‌ని మంద‌పాటి ఆకుల‌తో ఉండే వాము మొక్క గార్డెన్‌లలో సుల‌భంగా పెరుగుతుంది. ఈ మొక్క నుండే వాము వ‌స్తుంద‌ని అనుకుంటారు కొంద‌రు. కానీ వాము కోసం పెంచేదీ, ఆకుల‌ కోసం పెంచుకునేదీ రెండూ ఒక‌టి కాదు. ఇండియ‌న్ బొర‌జ్‌గా పిలిచే వాము ఆకులు వాము గింజ‌ల వాస‌న‌ని పోలి ఉండ‌డంతో ఆ పేరుతో పిలుస్తుంటారు. అయితే ఈ ఆకుల్ని బ‌జ్జీల కోస‌మే వాడుతుంటారు. కానీ దీని వల్ల ప్ర‌యోజ‌నాలెన్నో కలుగుతాయి.

Ajwain Leaves do not leave this plant wherever it appears
Ajwain Leaves

1. ప‌ది, ప‌న్నెండు ఆకుల్ని ముక్క‌లుగా చేసి నీళ్ల‌లో వేసి నాలుగో వంతు అయ్యే వ‌ర‌కూ మ‌రిగించి ఆ క‌షాయాన్ని తాగితే ద‌గ్గూ, జ‌లుబూ, సాధార‌ణ జ్వ‌రం వంటివి త‌గ్గుతాయి. మూత్ర‌పిండాల్లో రాళ్లున్న వాళ్ల‌కీ ఇది మంచిదే.

2. పిల్ల‌ల‌కు కాస్త సైంధ‌వ ల‌వ‌ణంతో క‌లిపి ఆ ఆకులను నూరి ఆ ర‌సాన్ని నాకించినా జ‌లుబూ, ద‌గ్గు త‌గ్గుతాయి. తల్లిపాలు తాగే పిల్ల‌ల‌కు జ‌లుబూ, ద‌గ్గు వ‌స్తుంటే కాస్త తేనె క‌లిపిన ఈ ఆకుల ర‌సాన్ని చ‌నుమొన‌ల‌కి రాసి తాగిస్తే ఆయా సమస్యలు తగ్గుతాయి. అలాగే పాలిచ్చే త‌ల్లులు ఒక‌టో రెండో ఆకుల్ని నేరుగా తిన‌డం వ‌ల్ల పాలు బాగా ప‌డ‌తాయి.

3. పొట్ట నొప్పిగా ఉన్నా ఆక‌లి లేకున్నా ఒంటి మీద ద‌ద్దుర్లు వ‌చ్చినా ఈ ఆకుల్ని తింటే ఉప‌శ‌మ‌నం లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్ని స‌లాడ్స్‌లో వేసుకుని తిన‌డం వ‌ల్ల ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వును కరుగుతుంది. తద్వారా బ‌రువు త‌గ్గుతారు.

4. వామాకు, అల్లం క‌లిపి మెత్త‌గా నూరి తీసిన ర‌సం తాగితే ఆక‌లి అవుతుంది. అజీర్తి త‌గ్గుతుంది.

5. కండ్ల‌క‌ల‌క‌తో బాధ‌ప‌డే వాళ్లు వామాకును దంచి ముద్దగా చేసి దాన్ని కళ్ల చుట్టూ పెడితే మంచిది. దీంతో సమస్య తగ్గుతుంది. అలాగే ఈ ఆకుల్ని నుదుటి మీద పెట్టుకుంటే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. దీంతోపాటు గాయాలు, పుండ్లు, దుర‌ద‌ల‌కీ ఇది పనిచేస్తుంది.

Admin

Recent Posts