ఆధ్యాత్మికం

Rudraksha And Rashi : ఏ రాశి వారు ఏ రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే మంచిది..?

Rudraksha And Rashi : అంతా మంచి జరగాలని చాలామంది మాల వేసుకోవడం.. రుద్రాక్షల‌ను ధరించడం వంటివి చేస్తూ ఉంటారు. చాలామంది పెద్దలు రుద్రాక్షల‌ని ధరించడాన్ని మీరు చూసి ఉంటారు. శివుడి అనుగ్రహాన్ని పొందాలంటే కచ్చితంగా రుద్రాక్షల‌ని ధరించాలని పెద్దలు అంటుంటారు కూడా. రుద్రాక్షలు శివుడి కన్నీటి నుండి ఉద్భవించినవి అని భక్తులు నమ్ముతుంటారు. రుద్ర పురాణంలో రుద్రాక్ష ధారణ వలన కలిగే ప్రయోజనాలను కూడా వివరించడం జరిగింది.

మరి ఈరోజు మనం రుద్రాక్ష వలన కలిగే ప్రయోజనాల గురించి, ఏయే రాశుల వారు ఎలాంటి రుద్రాక్షలని వేసుకోవాలి అనేది చూద్దాం. ఆయా రాశుల వారు వారి రాశులకి అనుగుణంగానే రుద్రాక్షలను ధరించాలి అని పండితులు అంటున్నారు. రుద్రాక్షలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి.

rudraksha according to zodiac signs

వివిధ పరిణామాలు, వివిధ చారల‌తో రుద్రాక్షలు వివిధ రకాలుగా కనబడుతుంటాయి. ప్రతి ఒక్క రుద్రాక్ష కూడా విభిన్నమైన గుణాన్ని కలిగి ఉంటుంది. మరి ఏ రాశి వారికి ఎటువంటివి మంచి చేస్తాయో చూద్దాం. మేష రాశి వారు అదృష్టాన్ని పొందడం కోసం ఏకముఖి, ద్విముఖి, పంచముఖి రుద్రాక్షలను ధరిస్తే మంచిది. వృషభ రాశి వాళ్లయితే చతుర్ముఖ, షణ్ముఖ, 14 ముఖాలు కలిగి ఉన్న రుద్రాక్షలను ధరిస్తే మంచిది.

మిథున రాశి వాళ్ళైతే చతుర్ముఖ, పంచ ముఖి, పదమూడు ముఖాల రుద్రాక్షలను ధరించడం మంచిది. కర్కాటక రాశి వాళ్ళు మూడు, ఐదు, గౌరీ శంకర్ రుద్రాక్షలను వేసుకోవడం మంచిది. అదే సింహ రాశి వారైతే మూడు, ఐదు ముఖాల రుద్రాక్షలను ధరించాలి. కన్య రాశి వారు నాలుగు, ఐదు, పదమూడు ముఖాల రుద్రాక్షలను వేసుకోవడం మంచిది. తుల రాశి వారు కూడా చతుర్ముఖ, ఆరు, 14 ముఖాల రుద్రాక్షలను ధరించాలి. వృశ్చిక రాశి వారు ఐదు ముఖాలు ఉండే రుద్రాక్ష‌ల‌ను, ధ‌నుస్సు రాశి వారు 9 ముఖాల రుద్రాక్ష‌ల‌ను, మకర రాశి వారు అయితే నాలుగు, ఆరు, 14 ముఖాల రుద్రాక్షలను ధరించాలి. అలాగే కుంభ రాశి వారు 7 ముఖాల రుద్రాక్ష‌ల‌ను, మీన రాశి వారు 11 ముఖాల రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే మంచి జ‌రుగుతుంది.

Admin

Recent Posts