హెల్త్ టిప్స్

బీర్ తాగే వారికి ఈ విష‌యం తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఎందుకో తెలుసా..?

మ‌ద్యం ప్రియులు ఇష్ట‌ప‌డే పానీయాల్లో బీర్ కూడా ఒక‌టి. మ‌ద్యం అంటే.. అందులో అనేక ర‌కాల వెరైటీలు ఉంటాయి. అయితే అన్నింటిలోనూ ఆల్కహాల్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. బీర్‌లో త‌క్కువ‌గా ఉంటుంది. దీంతోపాటు బీర్ తాగ‌డం వ‌ల్ల అంత‌గా హ్యాంగోవ‌ర్ రాదు. అలాగే సుల‌భంగా తాగ‌వ‌చ్చు. క‌నుక బీర్‌ను మ‌ద్యం ప్రియులు ఎక్కువ‌గా సేవిస్తుంటారు. ఇక వేస‌వి వ‌స్తే చాలు.. చ‌ల్ల చ‌ల్ల‌ని బీర్‌ను తాగ‌నిదే ఉండ‌లేరు. బీర్‌ను ఎప్పుడంటే అప్పుడు లాగించేస్తుంటారు. అయితే బీర్‌ను తాగ‌డం వ‌ల్ల లాభాలే ఉంటాయని చెబుతున్నారు. బీర్‌ను తాగితే ప‌లు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని సైంటిస్టులు అంటున్నారు. బీర్‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌పంచ వ్యాప్తంగా నీళ్లు, టీ త‌రువాత అత్యంత ఎక్కువ‌గా సేవిస్తున్న పానీయాల్లో బీర్ మూడో స్థానంలో నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే బీర్ చాలా మంది మ‌ద్యం ప్రియుల‌కు ఫేవ‌రెట్ డ్రింక్‌గా మారింది. బీర్‌లో అనేక ర‌కాల బి విట‌మిన్లు ఉంటాయి. అందువ‌ల్ల మ‌నం ఆరోగ్య‌కర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బీర్‌ను తాగ‌డం వ‌ల్ల విట‌మిన్ ఇ కి బ‌లం ల‌భిస్తుంది. ఇది చ‌ర్మాన్ని యంగ్‌గా ఉంచుతుంది. అందువ‌ల్ల వ‌య‌స్సు మీద ప‌డినా వృద్ధాప్య ఛాయ‌లు రాకుండా ఉంటాయి. ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. బీర్‌ను తాగ‌డం వ‌ల్ల ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. దీంతో వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే మ‌తిమ‌రుపు, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డినా కూడా మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది.

beer benefits what to know about them

బీర్‌ను వారంలో క‌నీసం 2 సార్లు 2 గ్లాసుల చొప్పున తాగితే బీపీ త‌గ్గుతుంద‌ని నిపుణులు చేపట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే బీర్‌ను సేవించ‌డం వ‌ల్ల కాల్షియం ల‌భిస్తుంది. ఎముక‌లు బ‌లంగా మారుతాయి. దీంతోపాటు గుండె జబ్బులు వ‌చ్చే అవ‌కాశాలు 30 శాతం మేర త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక బీర్‌ను సేవించ‌డం వ‌ల్ల విట‌మిన్ బి12 పుష్క‌లంగా ల‌భిస్తుంది. దీంతో ఐర‌న్ లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. రక్త‌హీన‌త త‌గ్గుతుంది. జ్ఞాప‌కశ‌క్తి పెరుగుతుంది. అలాగే కిడ్నీ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే బీర్ ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ వారంలో దీన్ని 2 సార్ల‌కు మించి తీసుకోరాదు. అలాగే ఒక్కోసారి 2 గ్లాసుల‌కు మించి తాగ‌రాదు. లేదంటే ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌క‌పోగా దుష్ప‌రిణామాలు ఏర్ప‌డ‌తాయి. క‌నుక మోతాదులో తీసుకుంటేనే లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. కాబ‌ట్టి బీర్ తాగేవారు అధికంగా తాగ‌కండి. త‌క్కువ‌గానే తాగండి. లేదంటే లాభాల‌ను కోల్పోతారు.

Admin

Recent Posts