Samantha : అంద‌రినీ మ‌ద్యం తాగ‌మంటావా ? స‌మంత‌ను భారీ ఎత్తున విమ‌ర్శిస్తున్న నెటిజన్లు..!

Samantha : సోష‌ల్ మీడియాలో స‌మంత ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఈమె త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోపాటు త‌న సినిమా అప్‌డేట్స్‌ను త‌న సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తులను కూడా ఈమె ప్ర‌మోట్ చేస్తుంటుంది. అందులో భాగంగానే స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు పోస్టులు పెడుతూ కోట్ల కొద్దీ రూపాయ‌లను ఆర్జిస్తోంది. అయితే అంతా బాగానే ఉంది.. కానీ తాజాగా ఆమె పెట్టిన అలాంటి ఓ బ్రాండ్‌కు చెందిన పోస్ట్ వ‌ల్ల ఆమె చిక్కుల్లో ప‌డింది. అలాంటి ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేస్తావా ? అంటూ నెటిజ‌న్లు స‌మంత‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

Samantha gets trolled by netizen for promoting alcohol brand
Samantha

స‌మంత‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 22 మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్న విష‌యం విదిత‌మే. అయితే ఈ ఫాలోయింగ్‌ను ఆమె క్యాష్ చేసుకుంటోంది. అప్పుడ‌ప్పుడూ ప‌లు బ్రాండ్ల‌ను ఈమె ప్ర‌మోట్ చేస్తుంటుంది. అందుకు గాను ఈమె భారీ ఎత్తునే రెమ్యున‌రేష‌న్‌ను కూడా అందుకుంటోంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఈమె ఓ మద్యం బ్రాండ్‌ను తాజాగా ప్ర‌మోట్ చేసింది. దీంతో జ‌నాల‌ను మందు తాగ‌మంటావా..? అంటూ స‌మంతను అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌ద్యం మానేయాల‌ని చెప్పాలి కానీ.. మ‌ద్యం సేవించ‌మ‌ని ప్రోత్స‌హించ‌డం ఏమిటి ? పైగా మ‌హిళా సాధికార‌త అంటూ పోస్టులు పెడతావ్.. అంటే.. అదంతా వ‌ట్టిదేనా ? అంద‌రినీ మ‌ద్యం సేవించ‌మంటావా ? అంటూ.. నెటిజ‌న్లు ఆమెను విమ‌ర్శిస్తున్నారు.

అయితే త‌న‌పై వ‌స్తున్న ఈ విమ‌ర్శ‌లు, ట్రోల్స్‌కు స‌మంత స్పందించ‌లేదు. కానీ ఈ విష‌యం మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక స‌మంత ప్ర‌స్తుతం య‌శోద అనే పాన్ ఇండియా మూవీలో న‌టిస్తోంది. అలాగే ఈమె న‌టించిన కాతు వాకుల రెండు కాద‌ల్ అనే మూవీ ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది. దీంతోపాటు శాకుంత‌లం అనే సినిమాలోనూ స‌మంత న‌టించింది.

Editor

Recent Posts