Samsung Galaxy F23 5G : కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసిన శాంసంగ్‌.. ధ‌ర త‌క్కువ‌, ఫీచ‌ర్లు అదుర్స్‌..!

Samsung Galaxy F23 5G : ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ కొత్త‌గా గెలాక్సీ ఎఫ్‌23 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఇందులో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను కూడా అందిస్తున్నారు.

Samsung Galaxy F23 5G smart phone launched in India
Samsung Galaxy F23 5G

గెలాక్సీ ఎఫ్‌23 5జి స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 750జి ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. దీనివ‌ల్ల 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఫోన్‌లో 4/6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ల‌భిస్తున్నాయి. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ లభిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. వెనుక‌వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. అద‌నంగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా ఉంది. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క భాగంలో అమ‌ర్చారు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌23 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,499 ఉండ‌గా.. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.18,499గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫ‌ర్ కింద ఈ ఫోన్ల‌ను రూ.14,999, రూ.15,999 ధ‌ర‌ల‌కు పొంద‌వ‌చ్చు. ఐసీఐసీఐ కార్డుల‌తో మ‌రో రూ.1000 డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు శాంసంగ్ ఇండియా స్టోర్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Share
Editor

Recent Posts