Shanagapappu Kobbarikura : శ‌న‌గ‌ప‌ప్పు, కొబ్బ‌రిని క‌లిపి ఇలా కూర చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Shanagapappu Kobbarikura : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌ప‌ప్పు కూడా ఒక‌టి. దీనితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ అన్నీ ల‌భిస్తాయి. శ‌న‌గ‌పప్పుతో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో శ‌న‌గ‌ప‌ప్పు కొబ్బ‌రి కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ప‌చ్చి కొబ్బ‌రి వేసి చేసే ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే శ‌న‌గ‌పప్పు కొబ్బ‌రి కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌న‌గ‌ప‌ప్పు కొబ్బ‌రి కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ గ్లాస్, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – ఒక టీ గ్లాసులు, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

Shanagapappu Kobbarikura recipe in telugu very tasty
Shanagapappu Kobbarikura

శ‌న‌గ‌ప‌ప్పు కొబ్బ‌రి కూర త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నాన‌బెట్టుకున్న శ‌న‌గ‌ప‌ప్పును తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి ఉడికించాలి. శ‌న‌గ‌ప‌ప్పు మెత్త‌గా ఉడికిన త‌రువాత అందులో నీటిని వ‌డ‌క‌ట్టుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి.ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ఉడికించుకున్న శ‌న‌గ‌ప‌ప్పును వేసి త‌డి పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా కొబ్బ‌రి తురుమును వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే శ‌న‌గ‌ప‌ప్పు కొబ్బ‌రి కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. శ‌న‌గ‌ప‌ప్పుతో త‌ర‌చూ చేసే వంట‌ల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కొబ్బ‌రి వేసి కూర‌గా చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ శ‌న‌గ‌ప‌ప్పు కొబ్బ‌రి కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts