వినోదం

మహేష్, పవన్ సినిమాలను తిర‌స్క‌రంచిన శోభన్ బాబు.. ఎందుకంటే..?

తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు స్టార్ హీరో శోభ‌న్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న అప్ప‌ట్లో ఎన్నో చిత్రాల్లో న‌టించి త‌న స‌త్తా చాటారు. అద్భుత‌మైన యాక్టింగ్ ఈయ‌న సొంతం. సోగ్గాడు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది శోభ‌న్ బాబే. ఈయ‌న త‌న స్టైల్‌తోనూ ఎంతో మందిని ఆక‌ట్టుకున్నారు. అప్ప‌ట్లో అంద‌మైన న‌టులు అన‌గానే మ‌నకు శోభ‌న్ బాబు పేరే ముందుగా గుర్తుకు వ‌స్తుంది. ఇక శోభ‌న్ బాబు అనేక పౌరాణిక‌, జాన‌ప‌ద, సాంఘిక చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న ఎక్కువ‌గా ఫ్యామిలీ చిత్రాల‌ను చేశారు. దీంతో ఆయ‌న‌కు మ‌హిళా ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్ప‌వ‌చ్చు.

విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న ఆయ‌న సొంతం. ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. అయితే వ‌య‌స్సు పైబ‌డ్డాక ఆయ‌న ఇక సినిమాల‌కు దూర‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికీ షాకిచ్చారు. త‌న కుటుంబం నుంచి కూడా ఎవ‌రినీ సినిమా రంగంలోకి వెళ్ల‌నివ్వలేదు. అయితే హీరోగా న‌టిస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న త‌న సంపాద‌న‌తో ఎన్నో ఆస్తుల‌ను కూడ‌బెట్టారు. ముఖ్యంగా భూముల‌ను బాగా కొన్నారు. దీంతో ఆయ‌న పిల్ల‌ల‌కు డ‌బ్బుకు కొదువ లేకుండా పోయింది. అందుక‌నే పిల్ల‌ల్ని స‌గం సినిమాల‌కు దూరం చేశార‌ని అంటారు. ఇక అప్ప‌ట్లో ఏ హీరోకు లేని ఆస్తి శోభ‌న్ బాబుకు ఉండేది.

shobhan babu rejected mahesh babu and pawan movies

ఇక చెన్నైలో ఆస్తుల‌ను కూడ‌బెట్టిన శోభ‌న్ బాబు సినిమాల‌కు దూరం అయ్యాక అక్క‌డే సెటిల‌య్యారు. ఫ్యామిలీతో అక్క‌డే ఉన్నారు. సినిమాల‌కు రిటైర్మెంట్ ఇచ్చాక త‌న మాట‌కు తాను క‌ట్టుబ‌డ్డారు. ఎన్నో సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చినా ఆయ‌న చేయ‌లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమాకు మంచి పేరు వచ్చింది. అందులో పవన్ తో పాటు అతడి తండ్రిగా రఘువరన్ నటనకు కూడా మంచి స్పందన వచ్చింది. అయితే రఘువరన్ పాత్రకోసం శోభన్ బాబుకి ఛాన్స్ వచ్చినా వదిలేశారు. అంతేకాదు అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం అడిగితే కాదన్నారట. అలా మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ను వదిలేసుకున్నారు. అయితే సినిమా రంగం అంటే ఉన్న అయిష్ట‌త వ‌ల్ల‌నే శోభ‌న్ బాబు త‌న మాట‌కు క‌ట్టుబ‌డి ఇక సినిమాలు చేయ‌లేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అదే ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లో న‌టించి ఉంటే ఆ రేంజ్ వేరేగా ఉండేది. ఆయ‌న‌ను చూసేందుకే సినిమాల‌కు వచ్చేవార‌ని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts