వినోదం

Viral Photo : ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌..

Viral Photo : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, తమన్నా, త్రిష, రష్మిక ఫోటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది ఈ హీరోయిన్.. టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను ముద్దుగా చందమామ అంటారు. ఇప్పుడు గుర్తొచ్చింది కదా..ఆ క్యూట్ చిన్నారి మరెవరో కాదు గ్లామరస్ యాక్టర్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

kajal aggarwal childhood photo viral

ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు కాజల్. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాజల్ ఇపుడు వరుసగా సినిమాలు చేయడానికి ఓకే చెబుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక‌ ఏ మూవీతో కాజల్ రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Admin

Recent Posts