Shyam Singha Roy : ఓటీటీలో శ్యామ్ సింగ‌రాయ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Shyam Singha Roy : నాని ద్విపాత్రాభిన‌యంలో, సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం.. శ్యామ్ సింగ‌రాయ్‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న‌ప్ప‌టికీ కోవిడ్ ప్ర‌భావం వ‌ల్ల క‌లెక్ష‌న్ల‌ను పెద్ద‌గా రాబ‌ట్ట‌లేక‌పోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలో ప్ర‌సారం కానుంది.

Shyam Singha Roy will be streamed on OTT know the date

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ శ్యామ్ సింగ‌రాయ్ డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. దీంతో నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఈ నెల 21వ తేదీన స్ట్రీమ్ కానుంది. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ సంక్రాంతి అనంత‌రం ఓటీటీలో ప్ర‌సారం అవుతుంది.

శ్యామ్ సింగ‌రాయ్‌లో నాని న‌ట‌న‌కు, క‌థ‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ క‌లెక్ష‌న్ల‌ను సంపాదించింది. ఇక నాని మూవీలు ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా ఓటీటీల్లోనే విడుద‌ల‌వుతున్నాయి. మొద‌ట వి సినిమా, త‌రువాత ట‌క్ జ‌గ‌దీష్ మూవీలు ఓటీటీల్లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ థియేట‌ర్ల‌లో విడుద‌లైనా.. త్వ‌ర‌లో మళ్లీ ఓటీటీలో రానుంది. ఇక నాని త‌దుప‌రి సినిమా.. అంటే సుంద‌రానికి.. లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Admin

Recent Posts