lifestyle

Silver Ring : వెండి ఉంగ‌రాన్ని పెట్టుకుంటే ఇన్ని లాభాలా..?

Silver Ring : పురాతన కాలంలో మన పెద్దలు పాటించారని మనం కూడా కొన్నింటిని పాటిస్తూ ఉంటాము. నిజానికి పెద్దలు చెప్పారని, పెద్దలు చేసే వారని, మనం కూడా కొన్ని కొన్ని వాటిని పాటిస్తూ ఉంటాం. కానీ వాటి వెనుక అర్థం మనకి తెలియదు. చాలామంది వెండి ఆభరణాలను, బంగారు ఆభరణాలని పెట్టుకుంటూ ఉంటారు. వెండి ఉంగరాలని ఎక్కువ మంది వేళ్ళకి పెట్టుకుంటూ ఉంటారు. వెండి ఉంగరాన్ని పెట్టుకునే వాళ్ళు ఈ నియమాలని పాటిస్తే ఇక వారికి తిరుగు ఉండదు.

అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు, బంగారం కూడా బాగా వస్తుంది. వెండి ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు ఈ వేలికి పెట్టుకుని చూడండి. ఇక తిరు ఉండదు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. వెండి ఉంగరాన్ని ఏ చేతికి పెట్టుకోవాలి..?, ఏ వేలికి పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వెండికి చాలా శక్తి ఉంటుంది. వెండి ఉంగ‌రాన్ని పెట్టుకోవడం వలన ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు కూడా బంగారానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు.

silver ring wearing benefits know them

కానీ నిజానికి వెండికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పంచ భూలోకాలలో వెండికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వెండి ఉంటే ఆ వెండి డబ్బుని కూడా ఆకర్షించగలదు. అందుకని వెండికి అంత ప్రత్యేక స్థానం ఉంది. వెండిని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. ఎంతో కలిసి వస్తుంది. వెండిని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నో రకాల లాభాలని పొందవచ్చు.

వెండి ఉంగరాలని ఏమైనా కొనుగోలు చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత పంచలోహ‌ పాత్రలో నీళ్లు పోసి ఆ ఉంగరాన్ని అందులో వేయాలి. తర్వాత ఆ నీటిలో నుండి ఆ వెండి ఉంగరాన్ని తీసి మన చేతికి పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. బొటన వేలికి తప్ప అన్ని వేళ్ళకి వెండి ఉంగరాన్ని పెట్టుకోవచ్చు. బొటనవేలు, ఉంగరపు వేలు కంటే మిగిలిన మూడు వేళ్ళకి ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే ఫలితం రెట్టింపు ఉంటుంది.

Admin

Recent Posts