Allu Arjun : పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో పేరు వచ్చింది. ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు పలువురు బాలీవుడ్ నిర్మాతలు, హీరోయిన్స్ ఆసక్తిని చూపిస్తున్నారంటే.. ఆయన క్రేజ్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రముఖ ప్రొడ్యూసర్‌గా తండ్రి, మరోవైపు మెగా ఫ్యామిలీ అండ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
అల్లు అర్జున్ తన డ్యాన్స్, నటనతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్టైల్ స్టార్ అయ్యారు. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారారు. ఇక పుష్ప మూవీ ఆయనను అమాంతం నేషనల్ స్టార్‌ను చేసింది. అయితే తన కెరీర్ ప్రారంభం నుంచి అల్లు అర్జున్ భిన్న కథాంశంతో కూడిన చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే సినిమాకు తగినట్లు తన శరీరాన్ని మార్చుకుంటున్నారు.
అవసరం వస్తే సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించడం లేదా కథకు తగినట్లుగా సాధారణ వ్యక్తిగా కనిపించడం.. ఇలా అల్లు అర్జున్ ఏ క్యారెక్టర్‌లో అయినా సరే ఒదిగిపోతారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన ఫిట్ నెస్ పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఆయన వారంలో కనీసం 3 రోజుల పాటు వర్కవుట్స్ చేస్తారు. చేసినప్పుడల్లా ఎక్కువ సమయం పాటు జిమ్‌లో గడుపుతారు. అలాగే షూటింగ్స్ లేని సమయంలో ఆయన వారానికి కనీసం 7 నుంచి 9 సార్లు జిమ్‌లో గడుపుతారట. ఇక ఆహారం విషయానికి వస్తే.. ఆయన ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తప్పక గుడ్లు తీసుకుంటారు. చాక్లెట్స్ అంటే అల్లు అర్జున్‌కు ఎంతో ఇష్టం. రోజుకో చాకోబార్‌ను ఆయన కచ్చితంగా తింటారట.
శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఆయన కఠిమైన కసరత్తులు చేస్తారట. పుషప్స్, చిన్ అప్స్, డిప్స్ ను కచ్చితంగా చేస్తారు. అలాగే ఖాళీ కడుపుతో ట్రెడ్ మిల్‌పై పరుగెడతారు. 45 నిమిషాల పాటు ఆగకుండా రన్నింగ్ చేస్తారు. ఇలా బన్నీ ఫిట్‌నెస్ పరంగా ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు.
ఇక ఒక్కోసారి జంక్ ఫుడ్, బయటి ఫుడ్ తిన్నప్పుడు జిమ్‌లో కాస్త ఎక్కువ సమయం పాటు గడిపి ఆ క్యాలరీలను కరగదీస్తాడట. ఆయన సినిమాల్లో తన పాత్ర కోసం బరువు పెరగాలంటే అందుకు తగిన విధంగా డైట్ పాటిస్తారట. పుష్ప మూవీలో ఆయన కూలీగా కనిపించిన విషయం విదితమే. అందులో భాగంగానే ఆయన జుట్టు, గడ్డం పెంచారు. సినిమా మొత్తం అలాగే ఉంటారు. అలాగే బాగా సన్నగా అయ్యారు. ఇక పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలవగా.. ఈ మూవీ ఏకంగా రూ.326 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టి రికార్డులను చెరిపివేసింది. అలాగే పుష్ప 2 రూ.1500 కోట్లను కొల్లగొట్టింది.