Sindhi Pulao : రెగ్యుల‌ర్‌గా చేసే పులావ్‌కు బ‌దులుగా ఇలా ఒక్క‌సారి చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Sindhi Pulao : పులావ్ అన‌గానే చాలా మందికి హోట‌ల్‌లో తినే పులావ్ గుర్తుకు వ‌స్తుంది. కొంద‌రు ఇంట్లోనూ పులావ్‌ను చేసుకుంటారు. కొంద‌రు చికెన్‌, మ‌ట‌న్‌తో పులావ్ చేస్తే ఇంకొంద‌రు భిన్న ప‌దార్థాల‌ను వాడుతారు. అయితే ఎలా చేసినా స‌రే పులావ్ స‌హ‌జంగానే చాలా రుచిగా ఉంటుంది. ఇక రెగ్యుల‌ర్‌గా చేసుకునే పులావ్‌కు బ‌దులుగా ఇలా ఒక్క‌సారి పులావ్‌ను చేయండి. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి ఎవ‌రైనా గెస్టులు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇలా వెరైటీగా పులావ్‌ను చేసి పెట్ట‌వ‌చ్చు. దీన్ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ఇక ఈ పులావ్ ఏమిటి, దీన్ని ఎలా త‌యారు చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సింధీ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తి బియ్యం – 2 క‌ప్పులు (అర గంట ముందు నాన‌బెట్టాలి), నెయ్యి – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, ధ‌నియాల పొడి – ఒక టీస్పూన్‌, అనాస పువ్వు – ఒక‌టి, బిర్యానీ ఆకులు – 2, యాల‌కులు – 4, ఉల్లిపాయలు – 4, మిరియాలు – అర టీస్పూన్‌, ట‌మాటా గుజ్జు – పావు క‌ప్పు, వెల్లుల్లి త‌రుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం త‌రుగు – రెండు టేబుల్ స్పూన్లు, ప‌చ్చి బ‌ఠానీ – అర క‌ప్పు, ప‌చ్చి మిర్చి – 1, మిరియాల పొడి – పావు టీస్పూన్‌, కారం – 1 టేబుల్ స్పూన్‌, ల‌వంగాల పొడి – పావు టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – 1 టీస్పూన్‌, కొత్తిమీర త‌రుగు – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

Sindhi Pulao recipe make this dish in very easy and simple steps
Sindhi Pulao

సింధీ పులావ్‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా బాస్మ‌తి బియ్యాన్ని 90 శాతం వండి పెట్టుకోవాలి. స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నెయ్యి వేసి జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, యాల‌కులు, ఉల్లిపాయ ముక్క‌లు, మిరియాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగాక అన్నం త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసుకుని బాగా క‌ల‌పాలి. బ‌ఠానీలు ఉడికాక అన్నం వేసి మూత పెట్టి 10 నిమిషాలు అయ్యాక దింపేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే సింధీ పులావ్ రెడీ అవుతుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని లంచ్ లేదా డిన్న‌ర్‌లో లాగించేయ‌వ‌చ్చు. నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా కూర‌తోనూ తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.

Editor

Recent Posts