Sprouted Moong Dal Chapati : మొల‌కెత్తిన పెస‌ల‌తో చ‌పాతీల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Sprouted Moong Dal Chapati : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర్లు ఒక‌టి. వీటిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మొకెత్తించి తీసుకుంటే మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. మొల‌కెత్తిన పెస‌ర్లను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ అందుతాయి. ఈ మొల‌కెత్తించిన పెస‌ర్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చ‌పాతీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మొల‌కెత్తించిన పెస‌ర్ల‌తో చ‌పాతీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పెస‌ర్ల చ‌పాతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మొల‌కెత్తిన పెస‌ర్లు – ఒక‌ క‌ప్పు, అల్లం ముక్క‌లు – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చిమిర్చి – 4, గోధుమ‌పిండి – రెండు క‌ప్పులు, ప‌సుపు – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్.

 Sprouted Moong Dal Chapati recipe in telugu how to make
Sprouted Moong Dal Chapati

పెస‌ర్ల చ‌పాతీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో అల్లం, ప‌చ్చిమిర్చి, మొల‌కెత్తిన పెస‌ర్లు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మివ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో గోధుమ‌పిండి, ప‌సుపు, ఉప్పు, జీల‌క‌ర్ర, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మామూలు చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి. త‌రువాత పిండిని మ‌రోసారి క‌లిపి ఉండ‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీ వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక చ‌పాతీని వేసి కాల్చుకోవాలి.

దీనిని నూనె వేస్తూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌ర్ల చపాతీ త‌యార‌వుతుంది. దీనిని సాధార‌ణ చ‌పాతీలు తిన్న‌ట్టే న‌చ్చిన కూర‌ల‌తో తిన‌వ‌చ్చు. ఈ చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. మొల‌కెత్తించిన పెస‌ర్ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని పిల్ల‌ల‌కు ఇలా చ‌పాతీల‌ను చేసి ఇవ్వ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించిన వాళ్లం అవుతాము.

D

Recent Posts