Sree Leela : బళ్లారి రాజుగా పేరుగాంచిన గాలి జనార్ధన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన కుమార్తె వివాహ వేడుకను కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఘనంగా జరిపించారు. దీంతో ఈ వివాహ వేడుక అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ వేడుకకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు హీరోయిన్స్ డ్యాన్స్‌లు చేశారు. వారికి కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందించారు. ఈ క్రమంలోనే గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పెళ్లి వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడాయన తన కుమారుడు కిరీటిని వెండి తెరకు పరిచయం చేస్తున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి త్వరలోనే వెండి తెరకు పరిచయం కానున్నాడు. అందులో భాగంగానే ఆ సినిమాకు భారీ ఎత్తున ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు ఎంత ఖర్చు చేసి అయినా సరే తన కుమారున్ని ఆయన హీరోను చేయాలని చూస్తున్నారట. కనుక అన్నింటికీ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి చేయబోయే సినిమాకు పెళ్లిసందD బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుటున్నారట. అయితే ఈ భామకు ప్రస్తుతం డిమాండ్ బాగా ఉంది. ఈమె ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తోంది. రవితేజతో కలిసి ధమాకా అనే మూవీలో ఈ అమ్మడు నటిస్తోంది. దీనికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఈ క్రమంలోనే ఈ మూవీలో తీసుకునే మొత్తానికి రెట్టింపు మొత్తంలో రెమ్యునరేషన్‌ను ఇస్తామని కిరీటి టీమ్ అడిగిందట. ఈ క్రమంలో అందుకు శ్రీలీల ఒప్పుకుందని సమాచారం. అదే జరిగితే మూడో సినిమాకే భారీ ఎత్తున రెమ్యునరేషన్ అందుకున్న నటిగా శ్రీలీల రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.