Rakul Preet Singh : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ వెకేషన్‌కు వెళ్లడం కామన్ అయిపోయింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఆంక్షలు ఉండడంతో చాలా మంది మాల్దీవ్స్‌కు వెకేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో అనేక మంది హీరోయిన్స్ మాల్దీవ్స్ లో విహరిస్తున్నారు. ఇక తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా అక్కడ ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో కలిసి మాల్దీవ్స్‌కు వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ అందాలను ఒక రేంజ్ లో ఆరబోస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పలు వరుస ఫొటోలను పోస్ట్ చేస్తోంది. మాల్దీవ్స్‌లో బీచ్‌లో తన బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఆమె తాజాగా షేర్ చేసింది. అవి ఇంకా మరిచిపోకముందే పింక్ కలర్ బికినీలో మరోసారి ట్రీట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటో వైరల్ అవుతోంది.
ఇక గతేడాది తన బాయ్ ఫ్రెండ్‌ను అందరికీ పరిచయం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని అనుకున్నారు. కానీ అందుకు సమయం పడుతుందని ఈ భామ చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈమె పలు వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థాంక్ గాడ్, అలయాన్ అనే సినిమాలతో ఈమె బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సమయం లభించినప్పుడల్లా వెకేషన్స్‌లో సందడి చేస్తోంది.