Strawberry Smoothie : వేసవికాలం వచ్చిందంటే చాలు మనం ఎక్కువగా చల్లగా ఉండే పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి పండ్ల రసాలను తయారు చేసి తీసుకోవడంతో పాటు వాటితో రకరకాల స్మూతీలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన స్మూతీలల్లో స్ట్రాబెరీ స్మూతీ కూడా ఒకటి. స్ట్రాబెరీస్ తో చేసే స్మూతీని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చల్ల చల్లగా రుచిగా ఉండే ఈ స్ట్రాబెరీ స్మూతీని 5 నిమిషాల్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెరీ స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్ట్రాబెరీస్ ముక్కలు – ఒక కప్పు, పెరుగు – 6 టేబుల్ స్పూన్, అరటి పండు – 1,పంచదార – 2 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత, ఐస్ క్యూబ్స్ – 6 లేదా తగినన్ని.
స్ట్రాబెరీ స్మూతీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో లేదా బ్లెండర్ లో స్ట్రాబెరీ ముక్కలను తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ స్మూతీని గ్లాస్ లల్లో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్ట్రాబెరీ స్మూతీ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి చల్లారిన తరువాత కూడా తాగవచ్చు. వేసవికాలంలో ఇలా చల్ల చల్లగా స్ట్రాబెరీస్ తో స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఎండు నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. ఎండ వల్ల కలిగే నీరసం మన దరి చేరకుండా ఉంటుంది. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తాగుతారు. స్ట్రాబెరీలను నేరుగా తినని వారికి ఇలా రుచిగా స్మూతీలను తయారు చేసి ఇవ్వవచ్చు.