వినోదం

దేవ‌ర‌ని ‘వ‌ర’ ఎందుకు పొడిచేశాడు..? ఎన్‌టీఆర్ ఆన్స‌ర్ ఇదే..!

ఎన్‌టీఆర్‌, జాన్వీ క‌పూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం దేవ‌ర‌. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోంది. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ ఎన్‌టీఆర్‌కు మంచి బ్రేక్‌ను ఇచ్చింది. సాధార‌ణంగా రాజ‌మౌళి మూవీ అనంత‌రం హీరోల‌కు ఫ్లాప్ ప‌డుతుంది. కానీ ఎన్‌టీఆర్ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే దేవ‌ర హిట్ అవ‌డంపై తార‌క్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక దేవ‌ర మూవీలో క్లైమాక్స్‌లో దేవ‌ర కొడుకు వ‌ర దేవ‌ర‌ను క‌త్తితో పొడ‌వ‌డాన్ని చూపిస్తారు. అయితే దీనిపైనే చాలా మందిలో ఆస‌క్తి నెల‌కొంది. అస‌లు వ‌ర‌.. దేవ‌ర‌ను క‌త్తితో ఎందుకు పొడిచాడు.. అని ప్రేక్ష‌క‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేశాడు కొర‌టాల శివ‌. అయితే ఇదే విష‌యాన్ని యాంక‌ర్ సుమ ఎన్‌టీఆర్‌ను అడిగింది. అయితే ఇందుకు ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు.

suma asked jr ntr about vara character in devara movie

దేవ‌ర స‌క్సెస్ నేప‌థ్యంలో ఎన్‌టీఆర్‌, కొర‌టాల శివ‌తో యాంక‌ర్ సుమ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సుమ దేవ‌ర‌ని వ‌ర ఎందుకు పొడి చేశాడు…? అని ఎన్‌టీఆర్‌ను ప్ర‌శ్నించారు. అందుకు ఆయ‌న వెంట‌నే.. చెప్పేత్తారు మ‌రి. దేవ‌ర‌-2కి ఎవ‌రు టిక్కెట్లు కొంటారు.. అన్నీ తెలుసుకుందామ‌నే.. చిలిపి నువ్వు.. అన‌డంతో న‌వ్వులు పూశాయి. ఇక స‌ముద్రంలో స్కెలెటిన్స్ ఎలా వ‌చ్చాయ‌ని సుమ అడ‌గ్గా.. అవి అలా ఈదుకుంటూ వ‌చ్చేశాయ‌ని ఫ‌న్నీ ఆన్స‌ర్ ఇచ్చారు.  దీంతో మ‌రోసారి అంద‌రూ న‌వ్వేశారు. ఇక ఎన్‌టీఆర్ ప్ర‌స్తుతం వార్ 2, ప్ర‌శాంత్ నీల్ చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా, దేవ‌ర 2 వ‌చ్చే స‌రికి మ‌రో 2 ఏళ్లు ప‌ట్ట‌వ‌చ్చ‌ని అంటున్నారు. అందులో కొంత భాగాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ చేశారు. కొర‌టాల ప్ర‌స్తుతం వెకేష‌న్‌కు వెళ్తార‌ని, వచ్చాక దేవ‌ర 2 షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది.

Admin

Recent Posts