టెలికాం సంస్థ రిలయన్స్ జియోతోపాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ మధ్యే మొబైల్ చార్జిల ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. ఇంకా చాలా మంది కస్టమర్లు మారుతూనే ఉన్నారు. దీంతో ఉన్న కస్టమర్లను కాపాడుకునేందుకు ఆ కంపెనీలకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలోనే పలు చవకైన ప్లాన్లను ప్రవేశపెట్టడంతోపాటు ఉచిత డేటాను కూడా ఆయా కంపెనీలు అందిస్తున్నాయి.
ఇక రిలయన్స్ జియో తాజాగా తన ప్రీపెయిడ్ కస్టమర్లకు దీపావళి గిఫ్ట్‌ను అందించిందని చెప్పవచ్చు. నూతనంగా ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టడంతోపాటు ఇందులో కస్టమర్లకు ఉచితంగా డేటాను కూడా అందిస్తోంది. అలాగే ఇతర బెనిఫిట్స్‌ను కూడా పొందే వీలు కల్పిస్తోంది. జియో ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.749 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే దీంతో కస్టమర్లకు 72 రోజుల వాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు. అలాగే 2జీబీ డేటాను కూడా ఉచితంగా ఇస్తారు.
ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు ఉచితంగా వచ్చే 2జీబీ డేటా మొత్తం 144 జీబీ అవుతుంది. అయితే దీపావళి గిఫ్ట్ కింద మరో 20 జీబీ డేటాను ఈ ప్లాన్‌లో కస్టమర్లకు ఉచితంగా జియో అందిస్తోంది. దీంతో మొత్తం 164 జీబీ డేటాను ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు పొందవచ్చు. అలాగే 5జి ఉన్న ఏరియాల్లో అన్‌లిమిటెడ్ 5జి ఇంటర్నెట్ ను సైతం పొందవచ్చు. ఇక అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే పలు జియో యాప్స్‌కు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఈ విధంగా ఈ ప్లాన్‌తో అనేక బెనిఫిట్స్‌ను పొందవచ్చు.