Sweet Corn Pulao : స్వీట్ కార్న్‌తో పులావ్‌ను ఇలా చేయండి.. రుచి, ఆరోగ్యం.. రెండూ ల‌భిస్తాయి..!

Sweet Corn Pulao : స్వీట్ కార్న్ అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని చాలా మంది ఉడ‌కబెట్టుకుని తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అయితే స్వీట్ కార్న్‌తో ప‌లు ర‌కాల ఇత‌ర వంట‌కాలను కూడా చేసుకోవచ్చు. వాటిల్లో స్వీట్ కార్న్ పులావ్ ఎంతో ముఖ్య‌మైన‌ది. దీన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భ‌మే. దీన్ని త‌యారు చేసి తిన‌డం వ‌ల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ ల‌భిస్తాయి. స్వీట్ కార్న్‌తో పులావ్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Sweet Corn Pulao very tasty and healthy here it is the recipe
Sweet Corn Pulao

స్వీట్ కార్న్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మతి రైస్ 1 కప్పు, నీళ్ళు 1 ½ కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, బఠానీలు 1 కప్పు, ఉల్లి పాయ 1, అల్లం – చిన్న ముక్క, పచ్చి మిర్చి 1, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 2 స్పూన్లు, గరం మసాలా ¼ స్పూన్, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం కొద్దిగా, యాలకులు 2, లవంగాలు, దాల్చిన చెక్క , పుదీనా, బిర్యానీ ఆకులు 2.

స్వీట్ కార్న్ పులావ్ తయారీ విధానం..

ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ ని వేసి దానికి కారం, పసుపు, గరం మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత స్వీట్ కార్న్, బఠానీలు వేసి దోరగా వేయించాలి. అందులోనే బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి తగినంత ఉప్పు, నాన బెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. చివరిగా నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పులావ్ సిద్ధ‌మ‌వుతుంది. దీన్ని తిన‌డం వల్ల రుచి, ఆరోగ్యం రెండూ ల‌భిస్తాయి. చాలా త్వ‌ర‌గా కూడా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు.

Admin

Recent Posts