Sweet Pongal : ప‌ర‌మాన్నాన్ని ఇలా చేశారంటే.. వ‌దిలి పెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Sweet Pongal : మ‌నం వంట గ‌దిలో చేసే ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల్లో ప‌ర‌మాన్నం కూడా ఒక‌టి. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే ఇది చాలా మందికి ఇష్ట‌మైన తీపి వంట‌కం అని చెప్ప‌వ‌చ్చు. పండ‌గ‌ల‌కు, ప‌ర్వ దినాల‌కు మ‌నం చేసే తీపి వంటకాల్లో ఇది తప్ప‌కుండా ఉంటుంది. ఈ ప‌ర‌మాన్నాన్ని రుచిగా అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ర‌మాన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, శ‌న‌గ ప‌ప్పు – పావు క‌ప్పు, నీళ్లు – 3 క‌ప్పులు, పాలు – 6 క‌ప్పులు, పంచ‌దార – ముప్పావు క‌ప్పు లేదా త‌గినంత‌, ఉప్పు – చిటికెడు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, నెయ్యి – పావు క‌ప్పు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – కొద్దిగా, జీడి ప‌ప్పు పలుకులు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా.

Sweet Pongal very easy to make very tasty
Sweet Pongal

ప‌ర‌మాన్నం త‌యారీ విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో బియ్యాన్ని, శ‌న‌గ ప‌ప్పును వేసి శుభ్రప‌రుచుకోవాలి. త‌రువాత ఇందులో నీళ్లతోపాటు 2 క‌ప్పుల పాల‌ను కూడా పోయాలి. ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన త‌రువాత మూత తీసి అన్నాన్ని, శ‌న‌గ‌ప‌ప్పును గంటెతో మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఇందులో 4 క‌ప్పుల కాచిన పాల‌ను పోసి స్ట‌వ్ మీద ఉంచి ఉడికించాలి. ఇందులోనే పంచ‌దార‌ను కూడా వేసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు కల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత ఉప్పు, యాల‌కుల పొడి వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక కొబ్బ‌రి ముక్క‌ల‌ను, జీడిప‌ప్పును, ఎండు ద్రాక్ష‌ను ఒక దాని త‌రువాత ఒక‌టి వేసి మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను నెయ్యితో స‌హా ముందుగా త‌యారు చేసుకున్న ప‌ర‌మాన్నంలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయడం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ర‌మాన్నం త‌యార‌వుతుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ప‌ర‌మాన్నం త‌యార‌వ‌డంతోపాటు రుచిగా కూడా ఉంటుంది. ఇలా చేసిన ప‌ర‌మాన్నాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts