Telangana Style Chamagadda Pulusu : తెలంగాణ స్టైల్‌లో చామ‌గ‌డ్డ పులుసు ఇలా చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Telangana Style Chamagadda Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప‌ల‌ల్లో చామ‌గ‌డ్డ‌లు కూడా ఒక‌టి. చామ‌గ‌డ్డ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక ర‌కాల పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. చామ‌గుడ్డ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చామగడ్డ‌ల‌తో చేసే వంట‌కాల్లో చామ‌గ‌డ్డ‌ల పులుసు కూడా ఒక‌టి. చామ‌గ‌డ్డ‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పులుసును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ చామ‌గ‌డ్డ పులుసును తెలంగాణా స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చామ‌గ‌డ్డ‌ల పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చామ‌గడ్డ‌లు – పావుకిలో, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, నీళ్లు – పావు లీట‌ర్.

Telangana Style Chamagadda Pulusu recipe in telugu make in this method
Telangana Style Chamagadda Pulusu

చామ‌గ‌డ్డ‌ల పులుసు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో చామ‌గ‌డ్డ‌లు వేసి రెండు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మెంతులు వేసి వేయించాలి. వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, క‌రివేపాకు వేసి వేయించాలి.

తరువాత ప‌సుపు, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత చామ‌గ‌డ్డ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో నిమిషం పాటు వేయించిన త‌రువాత చింత‌పండు ర‌సం, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చామ‌గ‌డ్డ‌ల పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చామ‌గ‌డ్డ‌ల పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts