Vankaya Curry : వంకాయ క‌ర్రీని ఒక్క‌సారి ఇలా చేయండి.. చూస్తేనే నోట్లో నీళ్లూర‌తాయి..!

Vankaya Curry : వంకాయ క‌ర్రీ.. వంకాయ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ క‌ర్రీని మ‌నం వివిధ రుచుల్లో, అనేక ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ వంకాయ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్క‌సారి ఈ కర్రీని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ వంకాయ క‌ర్రీని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా మ‌రింత రుచిగా వంకాయ‌ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, గుత్తి వంకాయ‌లు – పావుకిలో, ఉల్లిపాయ – 1, ట‌మాట – 1, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, అల్లం – ఒక ఇంచు ముక్క‌, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి- 2, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌,కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, చింత‌పండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – అర గ్లాస్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, గ‌రం మసాలా – పావు టీస్పూన్.

Vankaya Curry recipe in telugu make like this once
Vankaya Curry

వంకాయ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ‌, ట‌మాట‌, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వంకాయ‌ల‌ను నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకుని నూనెలో వేసుకోవాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మధ్య‌లో క‌లుపుతూ వంకాయల‌ను వేయించాలి. వంకాయ‌లు వేగిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే నూనెలో తాళింపు దినుసులు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాటపేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత వేయించిన వంకాయ‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు గుజ్జు, నీళ్లు పోసిక‌ల‌పాలి. త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌తో త‌ర‌చూ ఒకేర‌కం కూర‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts