business

ఇన్ఫోసిస్ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆఫ‌ర్ లెట‌ర్లు ఉండ‌వ‌ట‌..!

భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఎప్ప‌టిక‌ప్పుడు రిక్రూట్‌మెంట్ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటుంది. రిక్రూట్‌మెంట్ విష‌యంలో స్కామ్‌ల బారిన పడకుండా అభ్యర్థులను రక్షించే ప్రయత్నంలో ఆఫ‌ర్ లెట‌ర్‌లో ప‌లు మార్పులు చేసింది.ఇప్పటివరకు ఏ కంపెనీ అయినా ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ ఎటాచ్ చేసి పంపిస్తోంది. ఇన్ఫోసిస్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. కానీ ఇకపై ఇన్ఫోసిస్ ఈ పాత పద్ధతికి స్వస్తి పలకనుంది.

ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కంపెనీ క్రెడెన్షియల్స్ తో కంపెనీలో పోర్టల్‌లోకి లాగిన్ అవడం ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ పొందేలా మార్పులు తీసుకొస్తోంది. జాబ్ మార్కెట్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు ఆఫర్ లెటర్స్ పేరుతో నిరుద్యోగులు నష్టపోకుండా ఉండేందుకు ఇన్ఫోసిస్ ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలియ‌జేసింది. ఈ ప‌ద్ద‌తి ద్వారా పేపర్‌లెస్ రిక్రూట్మెంట్ సిస్టం ఏర్పడుతుందని ఇన్ఫోసిస్ ఆశిస్తోంది. కంపెనీలో చేరబోయే కొత్త ఉద్యోగులకు కూడా ఇదొక కొత్త అనుభూతిని అందిస్తుందనేది ఇన్ఫోసిస్ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈ మార్పు అవసరం అని కంపెనీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

there are no offer letters in infosys know the reasons

ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ కోసం అప్లై చేసే వారికి ఆ కంపెనీ కెరీర్ వెబ్‌సైట్‌పై ఓ కొత్త టిక్కర్ దర్శనం ఇస్తోంది. ఇంపార్టెంట్ నోటీస్ అని చెబుతున్న ఆ టిక్కర్‌లో ఇకపై ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్‌తో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కెరీర్ సైట్లోనే లభిస్తాయి. ఎవ్వరికీ ఎలాంటి ఆఫర్ లెటర్స్ పంపించడం అనేది జరగదు. లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా మీరే సైట్లోకి లాగిన్ అయి మీ ఆఫర్ లెటర్‌ని వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని రాసి ఉంది.ఈ మార్పుల‌తో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Sam

Recent Posts