information

Rs 10 Coin : అస‌లు రూ.10 నాణేల‌ను ఎందుకు తీసుకోవ‌డం లేదు ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ?

Rs 10 Coin : ప్ర‌స్తుతం స‌మాజంలో చాలా మంది పుకార్ల‌నే నమ్ముతున్నారు. అవి అబ‌ద్ధ‌మ‌ని తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు పుకార్ల‌నే న‌మ్ముతూ న‌ష్ట‌పోతున్నారు. ఇక అలాంటి వాటిలో ఒక‌టి రూ.10 కాయిన్ అని చెప్ప‌వ‌చ్చు. రూ.10 కాయిన్‌ల‌ను ఇప్ప‌టికీ చాలా మంది తీసుకోవ‌డం లేదు. అయితే అస‌లు ప్ర‌జ‌ల‌లో ఈ నాణెం ప‌ట్ల ఇంత‌టి అప‌న‌మ్మ‌కం నాటుకుపోవ‌డానికి, వారు ఈ కాయిన్స్‌ను తీసుకోక‌పోవ‌డానికి వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అప్ప‌ట్లో.. అంటే రూ.10 కాయిన్ల‌ను ఆర్‌బీఐ పెద్ద ఎత్తున విడుద‌ల చేసిన‌ప్పుడు ఈ నాణేనికి పెద్ద ఎత్తున న‌కిలీ కాయిన్ల‌ను త‌యారు చేసి మార్కెట్‌లోకి వ‌దిలారు. దీంతో అస‌లు కాయిన్ కు, న‌కిలీ కాయిన్‌కు మ‌ధ్య తేడా క‌నుక్కోవ‌డం క‌ష్ట‌మైంది. దీంతో రూ.10 నాణేల‌ను తీసుకోవ‌డ‌మే మానేశారు. ఈ కాయిన్ల‌ను తీసుకునేందుకు నిరాక‌రించారు. దీని వ‌ల్ల అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది ఇప్ప‌టికీ ఇంకా ఈ కాయిన్ల‌ను తీసుకోవ‌డం లేదు. కార‌ణం.. అవి న‌కిలీ అయి ఉంటాయేమోన‌ని. అందుక‌నే రూ.10 నాణేల‌ను కొంద‌రు తీసుకునేందుకు అంగీక‌రించ‌డం లేదు.

why everybody not taking 10 rupees coins

ఇక ఆర్‌బీఐ రూ.10 నాణేల‌పై నిషేధం విధించింద‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. కానీ అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా లేదు. న‌కిలీ వార్త‌ల‌ను గుర్తించేందుకు స‌రైన మాధ్య‌మం లేదు. దీంతో ఈ పుకారు బాగా వ్యాపించింది. అందుక‌నే చాలా మంది ఈ పుకారును న‌మ్మి రూ.10 నాణేల‌ను తీసుకునేందుకు నిరాక‌రించ‌డం మొద‌లు పెట్టారు. అది అలా అలా కొన‌సాగుతూ వ‌స్తోంది.

ప్ర‌ధానంగా ఈ రెండు కార‌ణాల వ‌ల్లే ఇప్ప‌టికీ చాలా మంది రూ.10 నాణేల‌ను తీసుకోవ‌డం లేదు. అయితే ఈ విష‌యంలో ఆర్‌బీఐ ఎప్పుడో స్ప‌ష్టంగా ప్ర‌క‌ట‌న చేసింది. రూ.10 నాణేలు చెల్లుతాయ‌ని, ఎవ‌రైనా తీసుకోక‌పోతే చ‌ట్ట ప్ర‌కారం శిక్షార్హుల‌వుతార‌ని తేల్చి చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా చోట్ల రూ.10 కాయిన్స్ ను చాలా మంది తీసుకోవ‌డం లేదు. మ‌రి ఈ పంథా భ‌విష్య‌త్తులో అయినా మారుతుందా, లేదా.. అన్న‌ది చూడాలి.

Admin

Recent Posts