వినోదం

Actors : రెండు జనరేషన్ ల‌కు చెందిన‌ హీరోలతో నటించిన హీరోయిన్లు.. ఎవ‌రో తెలుసా..?

Actors : సాధారణంగా హీరోలతో పోల్చినప్పుడు హీరోయిన్స్ ఎక్కువకాలం సినీ పరిశ్రమలో ఉండటం కష్టమే. హీరోయిన్ గా కొంత కాలం నటించాక అక్క, చెల్లి, వదిన వంటి పాత్రలతో సరిపెట్టుకోవాలి. అయితే కొంతమంది హీరోయిన్స్ రెండు జనరేషన్ ల‌కు చెందిన‌ హీరోలతో నటించారు. ఇప్పుడు వారి వివరాల‌ను తెలుసుకుందాం.

శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన ప్రేమాభిషేకం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే శ్రీదేవి అక్కినేని కొడుకు నాగార్జునతో కలిసి గోవిందా గోవిందా, ఆఖరి పోరాటం సినిమాల్లో నటించింది. అలాగే నయనతార వెంకటేష్ తో కలిసి లక్ష్మి, తులసి వంటి సినిమాలు చేసింది. రానాతో కలిసి కృష్ణం వందే జగద్గురుం సినిమాలో నటించింది. ఇక సమంత‌ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించింది. ఇక అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది.

these actress acted with 2 generations heroes

నయనతార బాలకృష్ణతో సింహ, శ్రీ రామరాజ్యం సినిమాల్లో జోడీ కట్టింది. ఇక అబ్బాయి ఎన్టీఆర్ తో అదుర్స్ లో నటించింది. శ్రియ బాలకృష్ణతో చెన్న కేసవరెడ్డి సినిమాలో నటించింది. అలాగే అబ్బాయి ఎన్‌టీఆర్‌ తో నా అల్లుడు సినిమాలో నటించింది. త్రిష బాలకృష్ణతో కలిసి లయన్ సినిమాలో నటించింది. ఇక ఎన్టీఆర్ తో కలిసి దమ్ము సినిమాలో నటించింది. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఇక చ‌ర‌ణ్‌తో ఎవడు సినిమాలో నటించింది.

కాజల్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. అలాగే చ‌ర‌ణ్‌తో మగధీర సినిమాలో జోడీ కట్టింది. ఖైదీ నంబ‌ర్ 150లో చిరు ప‌క్క‌న యాక్ట్ చేసింది. తమన్నా పవర్ స్టార్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించింది. అలాగే చ‌ర‌ణ్‌తో రచ్చ సినిమాలో జోడీ కట్టింది. అనుష్క వెంకటేష్ తో చింతకాయల రవి సినిమలో నటించింది. అలాగే రుద్రమదేవి సినిమాలో రానా ప‌క్క‌న‌ నటించింది.

Admin

Recent Posts