viral news

ఏంటి.. ఇలాంటి బట్టలు వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారా..? కొంచెమైనా బుద్ధి ఉండాలి..!

నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరాలని తొమ్మిది రోజులు కూడా కఠిన నిబంధనలు అనుసరించి పూజ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కలకత్తా దుర్గా పూజ సెలబ్రేషన్స్ లో ముగ్గురు మోడల్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు. హెమో శ్రీ భద్ర, సన్నతిమిత్ర అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఒక వీడియోని పోస్ట్ చేశారు. వారు వేసుకున్న దుస్తులు చూసి అందరూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

ఒక చిన్న ఆరెంజ్ డ్రెస్, హై బూట్స్ ని ఒకరు వేసుకున్నారు. మరొకరు రెడ్ బ్లౌజ్ వేసుకున్నారు. ఇంకొకరు బ్లాక్ డ్రెస్ తో దర్శనమిచ్చారు. సాధారణంగా పూజా కార్యక్రమాలు ఏమైనా జరుపుతున్నట్లయితే సాంప్రదాయమైన దుస్తులు వేసుకుంటూ ఉంటాము. దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా సాంప్రదాయమైన బట్టలు వేసుకుంటాము. కానీ ఈ మోడల్స్ మాత్రం అతి ఘోరమైన వస్త్రధారణలో కనపడి అందరిని షాక్ అయ్యేటట్టు చేస్తున్నారు.

these women get trolls for their dressing before durga matha

ఏంటి ఇలా దేవుడి దగ్గరికి వెళ్తారా అంటూ అందరూ వాళ్ళని తిట్టిపోస్తున్నారు. ‘దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా కనీసం మంచి బట్టలు వేసుకోండి. కొంచమైనా బుద్ధి ఉండాలి’ అంటూ వాళ్లపై అందరూ మండిపడుతున్నారు. యాక్టివిస్ట్ దీపికా నారాయణ భరద్వాజ్ కూడా వాళ్ళను క్రిటిసైజ్ చేశారు. నెటిజెన్స్ చెప్పినవన్నీ కూడా నిజమే అని వీరి వస్త్రధారణ చూస్తే మీకు అనిపిస్తుంది. చీర కట్టుకోక్కర్లేదు కానీ కాస్త డీసెంట్ గా ఉండే బట్టలైనా వేసుకుంటే బాగుండేది.

Peddinti Sravya

Recent Posts